
అలా అని తెలుగుని పూర్తిగా దూరం పెట్టలేదు. పవన్ కళ్యాణ్ ఆఫరనగానే ఎగిరి గంతేసి అజ్ఞాతవాసి చేశాడు. రెండు పాటలు హిట్టయ్యాయి కానీ దాని డిజాస్టర్ ఫలితం తీవ్రంగా నిరాశ పరిచింది. జెర్సీకి మంచి సోల్ ఉన్న స్కోర్ ఇచ్చాడు కానీ మాస్ కి రీచ్ అయ్యే అవకాశం లేకపోవడంతో మరీ గొప్ప మేజిక్ చేయలేకపోయింది. నాని గ్యాంగ్ లీడర్ సైతం సాంగ్స్ పరంగా ఎవర్ గ్రీన్ కాలేకపోయింది.
ఈ ఫలితాలు రావడానికి పలు కారణాలు ఉండొచ్చు. తన నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టుకోవడంలో సదరు డైరెక్టర్ల తడబాటో లేదా సమయం ఒత్తిడి వల్ల రాజీనో ఏదైతేనేం అనిరుధ్ రేంజ్ కి తగ్గ పాటలు ఇంకా టాలీవుడ్ కి బాకీ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ దేవర తనకే దక్కింది. భారీ బడ్జెట్ తో తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కావడం వల్ల తారక్, కొరటాల శివలు రాజీ పడేందుకు సిద్ధంగా లేరు.
కానీ అనిరుద్ ఉన్న బిజీకి అతన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చో లేదా చెన్నైకి వెళ్ళో బెస్ట్ రాబట్టుకోవడం అంత సులభం కాదు. పైగా ఇతను అరవంతో పోలిస్తే మన లెక్కలు అంచనాలు వేరుగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. గత అయిదారేళ్లలో అజిత్, విజయ్, రజనీకాంత్, సూర్య సినిమాలు తమిళంలో కమర్షియల్ గా ఎంత పే చేసినా తెలుగులో మాత్రం రికార్డులు తిరగరాయలేదు.
విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ కూడా అనిరుధ్ కే ఇచ్చారు. గతంలో జెర్సీకి పని చేసిన దర్శకుడు కాబట్టి సౌకర్యంగా ఉండొచ్చు కానీ ఈసారి చేస్తోంది ఎమోషనల్ డ్రామా కాదు. హై ఇంటెన్స్ సీరియస్ యాక్షన్. ఇది ఛాలెంజింగ్ ప్రాజెక్టే. ఇక్కడి జనాల అభిరుచితో పాటు చాలా ఈక్వేషన్లను అనిరుద్ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది చాలా బరువుతో కూడిన బాధ్యత. సరిగ్గా వాడుకుంటే తమన్ లేదా దేవి అంటూ రెండే ఆప్షన్లతో కొట్టుమిట్టాడుతున్న టాలీవుడ్ స్టార్లకు అనిరుధ్ అసలు గమ్యం కావొచ్చు.
Nagarjuna has raised an important point about the release problems faced by smaller films like…
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…