Telugu

తమన్ కి తత్వం తెలిసొచ్చింది మరి మార్పు మొదలా?

సినిమా విజయంలో సంగీతం ఎంత కీలక పాత్రో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు పోస్టర్లలో ఇళయరాజా పేరు చూసి థియేటర్లకు వెళ్లిపోయేవారట. ఒకవేళ బొమ్మ బాలేకపోతే పాటలు సంతృప్తినిచ్చాయని చెప్పుకుని మురిసిపోయేవారు. ఏఆర్ రెహమాన్, కీరవాణి, మహదేవన్, రాజ్ కోటి, మణిశర్మలు ఈ లెగసీని ఎంజాయ్ చేసినవాళ్ళే. తమన్, దేవిలు కూడా ఇదే దారిలో ప్రయాణం చేస్తూ వచ్చారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాపీ సాంగ్స్ ఎవరు చేసినా దొరికిపోతున్నారు. భారీ అంచనాల మధ్య స్టార్ హీరోల ఫ్యాన్స్ కు అనుగుణంగా ట్యూన్లు ఇవ్వలేకపోతే సోషల్ మీడియా వేదికగా సదరు మ్యూజిక్ డైరెక్టర్లను ట్యాగ్ చేసి మరీ నిలదీస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా ఉండటానికి ఛాన్స్ లేదు. ఒక్కసారి వైరల్ అయ్యాక ఈ నెగటివిటీ తప్పించుకోలేనంత దూరం ప్రయాణిస్తుంది.

ADVERTISEMENT

మొన్న విడుదలైన బ్రో ఆడియో సింగల్ జనానికి అంతగా ఎక్కువలేదు. బాలేదనే కామెంట్స్ ట్విట్టర్ లో వేలాదిగా వచ్చాయి. ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గుంటూరు కారం విషయంలో జరుగుతున్న రచ్చకు స్పందిస్తూ అందరూ దీని మీదే ఎందుకు పడుతున్నారని వాపోయాడు. బ్రో గురించి మాట్లాడుతూ దేనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వడం జరుగుతుందని ఎక్కువైతే తేడా కొడుతుందని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.

మాటలకేం కానీ అల వైకుంఠపురములో తర్వాత తమన్ మళ్ళీ దాన్ని మించిన ఆల్బమ్ ఇవ్వలేదన్నది వాస్తవం. సర్కారు వారి పాటకు టన్నుల్లో నమ్మకం పెట్టుకుంటే మహేష్ ఫ్యాన్స్ ని సంతృప్తి పరచలేకపోయాడు. దీనికన్నా ఎప్పుడో తమనే ఇచ్చిన బిజినెస్ మెన్, దూకుడే నయమని వాళ్ళు ఓపెన్ గానే కామెంట్ చేశారు. భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లలో బిజిఎంకే ఎక్కువ పేరొచ్చింది.

తమన్ అర్థం చేసుకోవాల్సిన సత్యం మరొకటి ఉంది. పరభాషా సంగీతం టాలీవుడ్ లోకి దూసుకొస్తోంది. హేశం అబ్దుల్ వహాబ్, గోపి సుందర్, జి వి ప్రకాష్ కుమార్, సంతోష్ నారాయణన్, జస్టిన్ ప్రభాకర్ లాంటి కొత్త రక్తంతో పాటు రెహమాన్, యువన్ శంకర్ రాజా, హరీష్ జైరాజ్ లాంటి పాత బ్యాచుకు సైతం అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇక్కడ దొరకడం లేదనే నిర్మాతలు పక్కింటికి వెళ్తున్నారు.

కాబట్టి వీలైనంత త్వరగా మనం ఎక్కడ వెనుకబడుతున్నామో గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. క్రికెట్ ఆడటం తప్పు కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం నేరం కాదు. కానీ కోట్లు కుమ్మరించి తన మీద పోస్తున్న సొమ్ముకు సంపూర్ణ న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రతి సంగీత దర్శకుడికి ఉంది. మేమిచ్చిందే ట్యూనూ మేము పాడిందే పాట అంటే ఎక్కువ కాలం చెల్లదు. ఎంతో భవిష్యత్తు ఉన్న తమన్ గేమ్ చేంజర్, గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఓజిలతో మళ్ళీ ట్రాక్ లో పడితే అంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేదేముంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sambarala Yeti Gattu: Sai Tej’s Biggest Gamble Yet?

Sai Dharam Tej is pinning big hopes on Sambarala Yeti Gattu. Made on the biggest…

25 minutes ago

Nagarjuna’s Indirect Dig at Aadarsha Kutumbam?

Nagarjuna has raised an important point about the release problems faced by smaller films like…

54 minutes ago