Telugu

గ్లామర్ డోస్ పెంచినట్లుంది!

తాను సాంప్రదాయ దుస్తులు ధరించి ధరించి విసిగెత్తిపోయాను, మోడ్రన్ గర్ల్ తరహాలో గ్లామర్ క్యారెక్టర్స్ ను ఇవ్వండి బాబోయ్… అంటూ వాపోయిన ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠికి, ఎట్టకేలకు తాను ఆశించిన పాత్ర దరి చేరినట్లు కనపడుతోంది. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఇంటిలిజెంట్’ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన నటిస్తోన్న లావణ్య, కాస్త గ్లామర్ డోస్ ను పెంచినట్లుగా లేటెస్ట్ స్టిల్స్ స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా విడుదల చేసిన ‘నా సెల్ ఫోన్’ అనే పాటలోని స్టిల్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా, అందులో ఈ బ్యూటీ మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో దర్శనమిచ్చి కన్నుల విందు చేస్తోంది. సంప్రదాయ కాస్ట్యూమ్స్ కంటే, ఈ గ్లామర్ దుస్తులలోనూ లావణ్య మెరిసిపోతూ కనపడుతోంది. దీంతో ఈ ‘ఇంటిలిజెంట్’ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి గ్లామర్ కూడా ఒకటన్న హింట్ ఇస్తోంది. ఏదైతేనేం… తనక్కావల్సిన క్యారెక్టర్ లోకి లావణ్య పరకాయ ప్రవేశం చేసినట్లుంది.

ADVERTISEMENT

ఇక, ఈ పాట విషయానికి వస్తే… థమన్ తరహా సంగీతంతో అలరిస్తుంది. మాంచి ఊపున్న బీటింగ్ ఉండడంతో, సాయిధరమ్ తేజ్ స్టెప్పులు వేయడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే లిరికల్ వీడియోలో చూపించిన స్టిల్స్ ను బట్టి, విదేశాల్లో అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించినట్లుగా కనపడుతోంది. వరికుప్పల యాదగిరి సాహిత్యం సమకూర్చిన ఈ పాటను జాస్ప్రీత్ జస్జ్, మనీషాలు ఆలపించారు. బీట్ సాంగ్స్ ఇష్టపడేవారికి వీనులవిందుగా ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Telugu Cinema Still Has a Special Place for Rakul

Rakul Preet Singh is keen to make a comeback to Telugu cinema soon. During a…

3 minutes ago

Rudravanam PS Review: Stale Malayalam-Coded Thriller Bites the Dust

BOTTOM LINE Stale Malayalam-Coded Thriller Bites the Dust PLATFORM ZEE 5 RUNTIME 2 Hrs 42…

4 minutes ago