
అందుకే చేతిలో ఉన్న ప్రధాన ఆయుధాన్ని మెగా కాంపౌండ్ రంగంలోకి దించుతోంది. ఈ నెల 10వ తేదీన గురువారం నాడు ఈ సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి, అందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా బరిలోకి దింపుతున్నారు. మెగా అభిమానులపై ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది గనుక, అంతిమంగా ఇది సినిమా కలెక్షన్స్ కు మరింత దోహదం చేస్తుందనే అంచనాలు ప్రొడక్షన్ యూనిట్ కు ఉండొచ్చు.
ఇటీవల పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ ఫిల్మ్ ఛాంబర్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. దీంతో బదులుగా పవన్ కూడా బన్నీ కోసం రాబోతున్నారు. ఇదంతా సినిమా కలెక్షన్స్ ను పెంచడంలో భాగం! ఇక్కడ కట్ చేస్తే… గత కొన్ని రోజులుగా మీడియాలపై ‘మెగా’ కాంపౌండ్ వేదికగా తీసుకున్న చర్యలకు ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్ లో వివరణ ఇచ్చుకునే అవకాశం ‘పవన్ అండ్ కో’కు దొరికినట్లవుతుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన ప్రకారం అయితే, అల్లు అరవింద్ చేసిన ‘తెరవెనుక కుట్ర’ ఆరోపణలకు సమాధానం కూడా ఈ వేడుక నుండే రాబోతోంది. అలాగే ‘చెప్పను బ్రదర్’ అన్న తర్వాత బన్నీపై వ్యక్తమైన వ్యతిరేకతకు ‘శుభంకార్డు’ వేసే ఆస్కారం కూడా కనపడుతోంది. ఇటీవల కాలంలో బన్నీ ఏం మాట్లాడినా సంచలనం అవుతున్న నేపధ్యంలో… సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇంకెన్ని సంచలనాలకు తెరలేపుతాడో అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…