
వారు అడిగిన సాంకేతిక నిపుణులను పరిశీలించినట్లైతే ఇది అడ్వెంచర్స్ తో కూడిన భారీ పీరియాడిక్ మూవీ అని అర్థం అవుతుంది. దీనిబట్టి సినిమా మీద ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఐతే కేవలం ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్నారని స్పష్టం చేసిన చిత్ర యూనిట్,నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. దీనితో సినీ అభిమానులలో ఈ సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి ఉంది. త్వరలో పూర్తివివరాలు వెల్లడించే అవకాశం ఉంది..
నాగ్ అశ్విన్ ఈ స్క్రిప్ట్ మీద దాదాపుగా ఏడాది పని చేసి అంతా పగడ్బంధీగా సిద్ధం చేసుకున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా తెర మీదకు వెళ్తుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మధ్య అశ్విని దత్ సినిమాలు బాగా తగ్గించారు. తనకు బాగా నమ్మకం ఉన్న స్క్రిప్టుల మీదే ఆయన డబ్బులు పెడుతున్నారు. దీనితో ట్రేడ్ కూడా ఈ చిత్రం మీద ఒక కన్నేసింది. ఈ సినిమా హిట్ అయితే నాగ్ అశ్విన్ తో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక సినిమా చెయ్యనున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…
The Andhra Pradesh MPTC and ZPTC election process has entered the next stage, with reports…