Telugu

పవన్ లాంటి వ్యక్తి చాలా అరుదు!

పవన్ కళ్యాణ్ పార్టీకి అన్నయ్య చిరంజీవి సపోర్టు ఉండాలని తాను కోరుకుంటున్నానని, తానైతే తమ్ముడికి తోడ్పాటుగా ఉంటానని, ఒకవేళ పవన్ వద్దన్నా కూడా ఒక పౌరుడిగా ఆ పార్టీలో చేరే ప్రాథమిక హక్కు తనకు ఉందని మెగా బ్రదర్ నాగబాబు పేర్కొన్నారు. ఒక సాధారణ కార్యకర్తలా ‘జనసేన’కు తన సేవలు అందిస్తానని చెప్పిన ‘టవర్ స్టార్,’ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, పవన్ తో ఎవరినీ పోల్చలేమని, ప్రత్యేకమైన వ్యక్తిత్వమని, అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే, రాష్ట్రం వంద శాతం బాగుపడుతుందనే నమ్మకం తనకు ప్రగాఢంగా ఉందని చెప్పారు.

జనసేన పార్టీ కోసం పనిచేయమని పవన్ కళ్యాణ్ తనను ఏమీ అడగలేదని, తమ్ముడు తన కోసం చాలా చేశాడని, అతని కోసం ఇంతవరకు తానేమీ చేయలేదని, అందుకే, వచ్చే ఎన్నికల్లో తమ్ముడి కోసం పనిచేయాలని ఉందని తన మనసులో కోరికను వెలిబుచ్చారు నాగబాబు. వచ్చే ఎన్నికల్లో ‘జనసేన’ తరపున స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించనున్నారా? అన్న ప్రశ్నకు ‘వాడే పెద్ద స్టార్. అంతకు మించిన స్టార్ ఎవరుంటారు?’ అని బదులిచ్చారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న శక్తి ‘మెగా’ ఫ్యాన్స్ అని, వాళ్లందరూ ఆయన వెనుకే ఉన్నారని, గతంలో జరిగిన ఒక ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ పై తాను ఆ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని, భావోద్రేకంతో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అన్నారు.

ADVERTISEMENT

అన్నయ్యను కానీ తమ్ముడిని కానీ ఎవరైనా విమర్శిస్తే మాత్రం తనకు చాలా బాధగా ఉంటుందని, ఆ క్రమంలోనే నాడు యండమూరి గురించి, వర్మ గురించి చేసిన వ్యాఖ్యలు సబబేనని అన్నారు. యండమూరి అన్నట్లు తనకు ఎటువంటి కాంప్లెక్స్ లు లేవని, చిన్నపిల్లవాడి మనస్తత్వం కాదని, తనను విమర్శిస్తే అసలు బాధపడనని, తన అన్నను లేదా తమ్ముడిని విమర్శిస్తే మాత్రం సహించనని, బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఆ వేడుక రోజున వాళ్లపై మండిపడ్డానని అన్నారు. ఇంకా చెప్పాలంటే, లేటుగా వాళ్లని విమర్శించానని తాను బాధపడుతున్నానని, యండమూరి, వర్మ అంటే తనకు గౌరవమని నాగబాబు చెప్పారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబు లేరన్న వర్మ ట్వీట్ కు బాధపడ్డారా? అనే వాళ్లిద్దరూ లేకపోతే తాను ‘జీరో’ అని స్పష్టం చేశారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు కళ్యాణ్ బాబులా తనకు స్టార్ డమ్ లేదనే విషయం వాస్తవమని, కనీసం ఒక పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్టుకు ఉండే పేరు కూడా తనకు లేదని అన్నారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం, వాళ్ల చిత్రాలు విజయం సాధించాయా? కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి? అనే విషయాలతో తన కాలం అలా సరదాగా గడిచిపోయిందని అన్నారు. అయితే, అదే సమయంలో తన గురించి ఆలోచించుకోకపోవడంతోనే తనకు కెరీర్ లేకుండా పోయిందని, తనకంటూ ఒక గుర్తింపు లేదనేది వాస్తవమని, అయినా సంతోషంగానే ఉన్నానని చెప్పారు.

ఒక రకమైన స్తబ్ధతతో కూడిన జీవితాన్ని ఇరవై ఏళ్లు గడిపానని, చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించమని అన్నయ్య చెప్పేవాడని, ఆలోచించగలిగే శక్తి ఉంది కనుక దర్శకత్వం వహించమని తమ్ముడు చెబుతుండేవాడని, అయితే, అన్నయ్య చెప్పినట్లు కష్టపడేవాడినని, కానీ, నిర్మాతగా, ఆర్టిస్ట్ గా అపజయాలు చవిచూశానని, జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే తాను విఫలమయ్యానని తన సినీ, వ్యక్తిగత విశేషాలను ఓ మీడియా వేదికగా ఈ మెగా బ్రదర్ పంచుకున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Atlee Rift: Raaka Making the Toxic Mistake?

Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…

5 hours ago

Irumudi Director Shiva Nirvana Set to Leave Tollywood?

Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…

5 hours ago