
సహజంగా ఇంట్లో పెళ్ళిళ్ళ తంతు వయసు ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. ఏదో కొన్ని అనివార్య కారణాలు మినహా వయసుతో నిమిత్తం లేకుండా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు కేవలం చాలా అరుదుగా నమోదవుతుంటాయి. మరి అక్కినేని ఇంట అంత అనివార్య కారణం ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో నెలకొంది. అఖిల్ నిశ్చితార్ధం డిసెంబర్ 9వ తేదీగా ఇప్పటికే ఖరారు కాగా, వచ్చే ఏడాది ప్రధమార్ధంలో అఖిల్ వివాహం జరగనుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే ఇంట్లో చిన్న పిల్ల వాడికి ముందుగా ఎలా చేయరో, ఒకే ఏడాది అన్నదమ్ముల వివాహాలు కూడా జరపరు. మరి ఆ లెక్క ప్రకారమైతే, ఉగాదికి ముందుగా అఖిల్ వివాహం జరిగితేనే చైతూకు అవకాశం దక్కుతుంది. లేదంటే మరో ఏడాది వేచిచూడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. లేదంటే… ఈ నమ్మకాలు, సంప్రదాయాలకు అతీతంగా చైతూ వివాహం జరుగుతుందేమో చూడాలి. ఇప్పటివరకు ‘ప్రేమ’పై ఫ్యాన్స్ ను టెన్షన్ లో పెట్టిన చైతూ… ప్రస్తుతం ‘పెళ్లి’పై కలవరపెడుతున్నాడు. నాగ్ మాత్రం చైతూ వివాహం వారి చేతుల్లోనే ఉందంటూ ఇప్పటికే స్పష్టంగా తేల్చిచెప్పేసారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…