
ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకుంటున్నారట. కొత్త నటీనటులతో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా మొదలు పెట్టి, హీరో సరిగా లేడు అనే కారణంగా ఆ సినిమాను మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు అదే స్క్రిప్టును యువసామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవిలతో ఈ సినిమాగా తీస్తున్నారు. ఫిదా తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై టాలీవుడ్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంలో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా కనిపిస్తాడట. దీని కోసం తెలంగాణ యాసలో మాట్లాడటానికి కోచింగ్ తీసుకుంటున్నాడు చైతన్య. శేఖర్ కమ్ములతో సినిమా అనగానే తన వేరే కమిట్ మెంట్స్ అన్నీ పక్కన పెట్టి ఈ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చాడు ఈ అక్కినేని హీరో. మరి దీనితో ఆయన ఇంకో హిట్ కొడతాడా అనేది చూడాల్సిఉంది.
డిస్ట్రిబ్యూటర్స్‌గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. కాగా మజిలీతో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నాగచైతన్య.. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి వెంకీమామ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 13న విడుదల కానున్నట్టు సమాచారం.
టీడీపి సీనియర్ నాయకులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఈరోజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “ఈ ఎన్నికలను ఎట్టి…
Prabhas is celebrating his birthday, and fans have found yet another reason to celebrate the…