
ఈ సినిమాలో నాగ చైతన్య మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని అంటున్నారు. అందులో ఒక పాత్ర రైతు కాగా మరో పాత్ర ఎన్నారై అని సమాచారం. మూడో పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఆ పాత్రల కోసం… సమంత, రష్మిక, ప్రియాంక అరుల్ మోహన్ లను అనుకుంటున్నరట.
ఈ సినిమా మీద అక్కినేని అభిమానులలో అంచనాలు భారీగా ఉండబోతున్నాయి. మనం వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు మరి విక్రమ్. అయితే మనం తరువాత విక్రమ్ కు ఆ స్థాయి సినిమా రాలేదు. అసలైతే అసలు హిట్ అనేదే లేదు. కాబట్టి ఈ సినిమా ఆయనకు చాలా కీలకం కాబోతుంది. దీనితో కసిగా పని చేస్తున్నట్టు సమాచారం.
ఈ చిత్రం కోసం అతను మొదటి సారిగా బయట కథతో సినిమా చేస్తున్నాడు. రైటర్ – దర్శకుడు బీవీఎస్ రవి కథ ఇస్తున్నాడు. గతంలో జోష్ అనే సినిమాతో నాగచైతన్యను పరిచయం చేసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది.
కొన్ని పదాలు, సంఖ్యలు కొన్నిటికి ప్రతీకలుగా మారుతుంటాయి. అటువంటిదే ‘11’కూడా. గత ఎన్నికలలో 175/175 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి…
Telangana BJP president N. Ramchander Rao is among the contenders for the Hyderabad–Rangareddy–Mahabubnagar Graduate MLC…