Telugu

‘చైతూ – సమంత’లపై హల్చల్ చేస్తోన్న ‘రియల్’ వీడియో!

సోషల్ మీడియాను సమంత – నాగచైతన్యల సంబంధం ఊపేస్తోంది. ధియేటర్లో ఫోటో, బాల్కనీలో మాట్లాడుకోవడం (నిజమైన వీడియోనో కాదో?) వంటివి ఓ రేంజ్ లో హల్చల్ చేయగా, తాజాగా వీరిద్దరూ నిజంగా మాట్లాడుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘మనం’ సినిమా విడుదలైన సమయంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య – సమంతలు కలిసి యాంకర్ రవి నేతృత్వంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో సమంతకు నిజమైన ప్రేమ ఫీలింగ్ కలిగేలా ప్రపోజ్ చేయాలని యాంకర్ రవి అడిగిన నేపధ్యంలో స్పందించిన చైతూ… ‘ఫ్రం బాటం ఆఫ్ మై హార్ట్ ఐ లవ్ యు సమంత’ అంటూ చెప్పగా, అది నమ్మేలా లేదంటూ సమంత చెప్పడంతో మరోసారి ప్రపోజ్ చేయాలని యాంకర్ విజ్ఞప్తి చేయగా, చైతూ ‘నేను చెప్పినదంతా నిజమే… నిజంగానే చెప్తున్నాను’ అని చెప్పడం విశేషం. అయితే ఆ తర్వాత మళ్ళీ ‘శ్యామ్ రియల్లీ ఐ లవ్ యు’ అని చెప్పగా, సమంత ‘ఓకే ఓకే’ అంటూ నవ్వేసింది.

ADVERTISEMENT

ఈ వీడియో ఇప్పటిది కాదు. ఆ సమయంలో ‘మనం’ చిత్ర ప్రమోషన్లో భాగంగా అని అంతా భావించారు. అయితే అది ప్రమోషన్ సినిమాకు సంబంధించింది కాదు, నిజ జీవితానికి సంబంధించింది అంటూ నెటిజన్లు ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అలాగే… కమెడియన్ ధర్మవరం ఒక సినిమాలో చెప్పినట్లు… నిజం చెప్తే ఎవడు నమ్మాడు… అప్పుడే చైతూ బహిరంగంగా చెప్పేసారు… ప్రేక్షకులే నమ్మలేదు… అంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

SCOOP: Fauzi’s New Date to Repeat Dil Raju-Mythri War?

Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…

9 minutes ago

Ram Pothineni’s RAPO23 Completes Second Schedule

Ram Pothineni is working on his first film as a writer-director, #RAPO23. He is also…

29 minutes ago