
ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు ఈరోజు ఉదయం విడుదల చేశారు, ఇందులో నటుడిని బాగా కండలు తిరిగిన శరీరంలో ఆకట్టుకునేలా కనిపించాడు. ఈ చిత్రంలో నటుడు విల్లుకారుడిగా కనిపిస్తారని సమాచారం. మహాభారతంలో అత్యుత్తమ విల్లుకారుడు అర్జునుడు. అర్జునుడికి మరో పేరు పార్ధు.
కాబట్టి ఈ సినిమాకు పార్ధు అనే టైటిల్ అనుకుంటున్నారు. పార్ధు నటుడి కెరీర్లో ఇరవయ్యవ చిత్రం ఇది. ఇక ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నారాయణ్ దాస్ నారంగ్, కలిసి నిర్మిస్తున్నారు. మనోజ్ రెడ్డి ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు, కథ మరియు స్క్రీన్ ప్లే సంతోష్ జగర్లపుడి రాశారు.
తన కెరీర్ లో ఎక్కువగా లవర్ బాయ్ పాత్రలు చేసిన నాగ శౌర్య ఈ మధ్య మాస్ వైపుకు మళ్లాడు. మొన్న ఆ మధ్య అశ్వథామ అనే చిత్రంతో చెయ్యి కాల్చుకున్నాడు. అయితే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అన్నట్టు మళ్ళీ అటువంటి సినిమాతోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. దానికోసం చాలా కష్టపడుతున్నాడు కూడా.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం లేదని జగన్ ముందే చెప్పేశారు. కానీ పార్టీ శ్రేణుల చేత వీర…
Janhvi Kapoor’s role in Ram Charan’s Peddi is back in discussion after Karan Johar brought…