యలహంక.. వైసీపీ కొంప ముంచుతుందా?

స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం లేదని జగన్‌ ముందే చెప్పేశారు. కానీ పార్టీ శ్రేణుల చేత వీర పోరటాలు చేయిస్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసి ఉన్నప్పుడు జగన్‌ కూడా తన తరపున కొత్త సమస్యలు, వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి కదా?

కానీ చెల్లి షర్మిల బెంగళూరులోని తమ యలహంక ప్యాలస్‌లో కూతురు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే, దానిని ఇచ్చే ప్రసక్తి లేదని జగన్‌ చెప్పారు.

ADVERTISEMENT

జగన్‌ సొంత మేనకోడలి పెళ్ళికి అవరోధాలు సృష్టిస్తున్నారనే ఈ వార్త తెలుగు మీడియా, సోషల్ మీడియాలో ప్రధానంగా వచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు, ఇలాంటి వార్త మహిళా ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని వేరే చెప్పక్కరలేదు.

కూతురు పెళ్ళి పనులతో బిజీగా ఉన్న వైఎస్ షర్మిల వీలు చేసుకొని పోలింగ్ సమయంలో మీడియా ముందుకు వచ్చి తన అన్న జగన్మోహన్ రెడ్డి తమని ఏవిధంగా ఇబ్బంది పెట్టారో చెప్పకుండా ఉండరు.

సొంత చెల్లిని, పెళ్ళి చేసుకోబోతున్న మేనకోడలిని కూడా జగన్‌ ఇబ్బంది పెడుతున్నారని ఆమె స్వయంగా చెప్తే, వైసీపీ కొంప ముంచడానికి అది చాలు.

కనుక ఇలాంటి సమయంలో జగన్‌ చేజేతులా ఇటువంటి సమస్యలు సృష్టించుకోకుండా సంయమనం పాటించి ఉండి ఉంటే ఈ ఎన్నికలలో వైసీపీ తక్కువ నష్టంతో బయటపడగలిగేది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Janhvi’s Peddi Look: Why Is Karan Johar Bringing It Up?

Janhvi Kapoor’s role in Ram Charan’s Peddi is back in discussion after Karan Johar brought…

13 minutes ago

PK–CBN Meet Amid Election Uncertainty

Deputy Chief Minister Pawan Kalyan’s visit to Chief Minister N. Chandrababu Naidu’s residence in Undavalli…

43 minutes ago