
[m9ad]
నటుడిగానే కాక, ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో “@నర్తనశాల” సినిమా ప్రమోషన్ బాధ్యతలను కూడా నెత్తి మీద వేసుకున్న శౌర్య, ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నాడు. అయితే ప్రతి ఇంటర్వ్యూలో హీరో విజయ్ దేవరకొండ గురించి యాంకర్లు అడుగుతున్న వైనం శౌర్యని ఇబ్బందులకు గురి చేస్తోంది. వాస్తవ పరిస్థితులలో ఈ ఇద్దరు హీరోలను పోల్చలేం. ఎవరి దారులలో వారు విజయవంతంగా కొనసాగుతున్నారు.
‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో కాబోయే స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ అందరి చేత నీరాజనాలు అందుకుంటున్న మాట వాస్తవం. అంత మాత్రాన విజయ్ క్రేజ్ గురించి నాగశౌర్యని అడగడం ఎంతవరకు సబబు? అన్నది యాంకర్లు కూడా ప్రశ్నించుకోవాలి. ఏదొకటి అడగాలి కాబట్టి, అడిగి ఇబ్బంది పెట్టడం తప్ప, నిజానికి అందులో ఎలాంటి విషయం లేదు, పొరపాటున శౌర్య ఏదైనా టంగ్ స్లిప్ అయితే రచ్చ రచ్చ కావడం తప్ప!
తొలుత ఇచ్చిన ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ క్రేజ్, స్టార్ డం గురించి స్పష్టంగా చెప్పాడు శౌర్య. దీంతో ప్రతి ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్నలు వేస్తున్నారు. ఇదెలా అయ్యిందంటే… గతంలో ఇలాగే పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయగా, ప్రస్తుతం ప్రతి యాంకర్ విజయ్ దేవరకొండను ప్రస్తావిస్తున్నారు. అయితే శౌర్యకు కావాల్సింది ఇది కాదు, తన సినిమాకు పోటీ లేకుండా మంచి రిలీజ్ డేట్ దొరికింది, దానికి తగిన విధంగా మంచి విజయం కూడా కావాలి, అంతే..!
Trivikram Srinivas had special praise for Venkatesh at the pre-release event of Aadarsha Kutumbam: House…
Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…