
Naga Vamsi faces viral rumour storm
సినిమా రిలీజ్‌కు ముందు నిర్మాత నాగవంశీ పేరు ట్విట్టర్‌లో తెగ తిరుగుతోంది. సినిమా గురించి కాదు. ఆయన వ్యక్తిగత జీవితంపై ఆధారాలు లేని ఓ పుకారును పట్టుకుని పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
ఓ రెడిట్ పోస్టును షేర్ చేయడంతో మొదలుపెట్టి, ఏళ్ల కిందటి వీడియోను కూడా బయటకు తీసుకొచ్చారు. సుమతో కలిసి వేదికపై ఉన్న ఓ నటి నాగవంశీ గురించి మాట్లాడిన క్లిప్‌ను ఈ పుకారుకు జోడిస్తున్నారు.
ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు కొత్తేమీ కాదు. ఎవరి గురించి ఏం జరుగుతుందనేది బయటివాళ్ల కంటే అక్కడున్న వాళ్లకే ఎక్కువ తెలిసి ఉండొచ్చు. అయితే అది వేరు. ఆధారాలు లేకుండా ఒకరి గురించి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వేరు.
సాధారణంగా హీరోలు, హీరోయిన్లపై ఇలాంటి చర్చలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నిర్మాతలను ఈ స్థాయిలో లాగడం మాత్రం తక్కువే. ఇప్పుడు నాగవంశీ విషయంలో ఇంతమంది ఒక్కసారిగా ఎందుకు ఈ ప్రచారాన్ని అందుకున్నారన్నదే ప్రశ్న. అదీ Epic సినిమా రిలీజ్‌కు ముందు!
దీని వెనుక ఎవరున్నారు, కావాలనే చేస్తున్నారా అన్నది తెలియదు. కానీ ఒకే పుకారును పదేపదే షేర్ చేస్తూ ఆయనను టార్గెట్ చేస్తున్న తీరు మాత్రం చర్చకు వస్తోంది.
నాగవంశీ ఇవన్నీ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ అంతమంది తన గురించి మాట్లాడుతుంటే అసలు ప్రభావమే ఉండదని ఎలా అనుకోగలం? అందులోనూ ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యక్తి ఆయన.
పట్టించుకోకు అని చెప్పడం సులువే. కానీ ఆధారాలు లేని పుకారుతో ఇంత రచ్చ అవసరమా?
After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…