
ఇవాళ ప్రోడ్యూసర్స్ కలిసి పెట్టిన ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ.. స్థలం దొరికితే మల్టీప్లెక్స్ కట్టేస్తున్న సేట్ జీ, సింగిల్ స్క్రీన్స్ గురించి బాధపడడం హాస్యాస్పదం అంటూ.. ఏషియన్ సునీల్ గురించి ఇండైరెక్ట్ గా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయమై సునీల్ ఆయన స్టైల్లో స్పందించారు. “అతనెవరో డూప్లికేట్ బాల్ వాలే (విగ్గు పెట్టుకునే వ్యక్తి) నేనేదో దొరికిన ప్రతి స్థలంలోనూ మల్టీప్లెక్స్ కట్టేస్తున్నా అని కామెంట్ చేశాడు. నేను 33 సింగిల్ స్క్రీన్స్ కూడా కట్టాను. ఇంకొన్ని ప్లానింగ్ లో ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడం కాదు” అని ఓ టీవీ ఛానల్ కి స్పెషల్ బైట్ లో పేర్కొన్నారు.
మరి నాగవంశీ కూడా అదే తరహాలో స్పందిస్తారా? ఈ గొడవ ఎక్కడ సర్దుమనుగుతుంది? సర్దిచెప్పే పెద్ద ఎవరు? అనేది వేచి చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…