Telugu

అనడం ఎందుకు…ఇబ్బంది పడటం ఎందుకు?

అసలు మన పని మనం చూసుకోకుండా…ఎందుకు వచ్చిన వివాదాలు? బాలయ్య పవన్ కళ్యాణ్ ని ఎదో అన్నాడు అని..మొన్నటివరకు నోరు మెదపకుండా ఎన్నికల హడావిడి మొదలు కావడంతో పాపం మెగా బ్రదర్ నాగ బాబు పొలిటికల్ గా కాస్త అప్డేట్ అవుదామని అనుకున్నారో…లేక తమ్ముడికి అండగా నిలుద్దాం అన్న భావనా తెలీదు కానీ…పదే పదే బాలయ్య టాపిక్ తెస్తూ బాలయ్య అభిమానులను రెచ్చగొట్టారు..

ఇక నాగ బాబు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అన్న కసితో ఉన్న బాల కృష్ణ అభిమానులు…చెన్నై లో ఒక ప్రోగ్రాం కి విచ్చేసిన నాగబాబుపై తమ ప్రతాపం చూపించారు. కట్ చేస్తే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా బాలయ్య నినాదాలతో నాగబాబుని ఇబ్బందులకు గురి చెయ్యడంతో అక్కడ మాట్లాడకుండానే నాగబాబు వెళ్లిపోయినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..

ADVERTISEMENT

అసలు ఇక్కడ నాగబాబు కానీ…వేరే ఇతర హీరోలు కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే…ఒక స్థాయికి వచ్చాక ఇతర హీరోలను టార్గెట్ చేసి విమర్శలు చేస్తే అనవసరమైన విమర్శలపాలవ్వక తప్పదు అని. ఇప్పటికే గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినందుకు అటు నాగబాబును, మరో పక్క బన్నీ ను ఆడేసుకున్నారు పవన్ ఫాన్స్…ఇప్పుడు అదే పవన్ కోసం నాగబాబు బాలయ్య ఫాన్స్ కి విలన్ అయిపోయాడు…ఇప్పటికైనా సెలెబ్రేటిస్ కాస్త ఆచి తూచి మాట్లాడితే వారికే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

God of War: Will Alia Bhatt Say YES to NTR & Trivikram?

NTR and Trivikram Srinivas are reportedly planning a massive project with the working title God…

38 minutes ago

ఏకగ్రీవాలు జరిగితే టికెట్ ఇవ్వనన్నారుగా…

ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు…

56 minutes ago