
అయితే దీనిపైనే నాగబాబు ఓ కీలక వ్యాఖ్య చేసారు. అది కూడా దాసరి వారసత్వం పైనే కావడంతో మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది. “ఇండస్ట్రీకి పెద్ద తల అంటారా? నాయకుడని అంటారా? పెద్ద దిక్కంటారా? వ్యక్తిగతంగా నేను నా సమస్యలతో ఎప్పుడూ ఆయన వద్దకు వెళ్లలేదు గానీ, నా వంటి వారి పరిష్కరించలేని అనేక సమస్యలను ఆయన అవలీలగా సాల్వ్ చేసి ఎంతో మందికి సాయపడ్డారు, ఆయన ఉన్నంత కాలమూ ఆ లోటు తెలియనివ్వలా… నెక్ట్స్ ఎవరుంటారు?” అంటూ దాసరి వారసత్వంపై పెద్ద చర్చకే దారి తీసారు నాగబాబు.
“ఆయన వారసుడిగా, ఆయనలా సమస్యలను భుజాన వేసుకుని, సొంత పనులను కూడా వదులుకుని, సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చే మంచి మనిషి ఎవరు? ఆయన ఆశీర్వాదంతో ఎవరో ఒకరు ముందుకొస్తారన్న నమ్మకం ఉంది” అంటూ మోహన్ బాబు పేరును ప్రస్తావించడం విశేషం. అలాగే పనిలో పనిగా రాఘవేంద్రరావు గారి పేరు కూడా ఉచ్చరించారనుకోండి..! అయితే ‘పెద్దరికం’ అవకాశం వస్తే, మెగా కాంపౌండ్ లో వ్యక్తులకు కాక, మోహన్ బాబు పేరును ప్రస్తావించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అన్న ప్రశ్న హల్చల్ చేస్తోంది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…