
“ప్రధాని నరేంద్రమోడీ పవన్ కళ్యాణ్పై గౌరవంతో ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడితే, మద్యలో వైసీపీ నేతలకు ఎందుకు అంత టెన్షన్?వారికి భయం పుట్టుకొందా లేక అభద్రతాభావామా? ప్రధాని నరేంద్రమోడీ-పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుకొంటే మీకెందుకు? మంత్రులు పనులు మానుకొని, పాలన గాలికొదిలేసి ఎప్పుడూ ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయో చూసి స్పందిస్తుండటమే పనిగా పెట్టుకొన్నట్లున్నారు.
వైసీపీ నేతలకు స్క్రిప్ట్ లేకపోతే ప్రసంగించలేరేమో కానీ పవన్ కళ్యాణ్కు అటువంటి సమస్య లేదు. ఏ అంశం గురించైనా ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. భారతీ సిమెంట్ కంపెనీకి లబ్ది కలిగించేందుకు మిగిలిన సిమెంట్ కంపెనీలన్నిటిపై ఒత్తిడి తెచ్చి సిమెంట్ బస్తా రేట్లు పెంచేయడం వాస్తవం కాదా? జగనన్న ఇళ్ళు పేరుతో జె-గ్యాంగ్ దోచుకొన్న మొత్తం రూ.15,191 కోట్లు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జె-గ్యాంగ్ అవినీతిని మొట్ట మొదట వెలికితీసి అందరిపై చర్యలు తీసుకొంటాము,” అని నాగబాబు హెచ్చరించారు.
నిన్న పవన్ కళ్యాణ్, నేడు నాగబాబు ఇద్దరూ కూడా ఏపీలో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ మాట్లాడటం గమనార్హం. అంటే జనసేన బిజెపితో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకొందా లేక బిజెపి-జనసేన కూటమి ఎన్నికలలో గెలిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…