
నాగార్జున హోస్టు చేస్తున్న బిగ్ బాస్ 3 సీజన్ మొదటి ఎపిసోడ్ ఏకంగా 17.9 రేటింగ్స్ తెచ్చుకుందట. బిగ్ బాస్ చరిత్రలోనే కాకుండా తెలుగు టెలివిజన్ చరిత్రలో టీవీ షోలలో ఇదే హైయెస్ట్ అట. గతంలో ఎన్టీఆర్ హోస్టు చేసిన సీజన్ వన్ మొదటి ఎపిసోడ్ 16.18 రేటింగ్స్ తెచ్చిపెట్టింది. నాని హోస్టుగా వ్యవహరించిన రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ కు మాత్రం కొంత తక్కువగా 15.05 రేటింగ్స్ వచ్చాయి. ఈ రికార్డుతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవాలి.
వంద రోజుల పాటు సాగే ఈ షో ఇప్పటికి పదకొండు రోజులు మాత్రమే అయ్యింది. ఈ ఊపుని చివరిదాకా ఉంచుకోవాలి. ఇక షో విషయానికి వస్తే ఈ వారం డేంజర్ జోన్ లో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్ట, పునర్ణవి, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, మరియు అతని సతీమణి వితిక షెరూ ఉన్నారు. వరుణ్ సందేశ్, వితిక షెరూ ఇద్దరిలో ఒకరు వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. అయితే బిగ్ బాస్ అంటేనే సంచలనాలకు నెలవు. కొన్నిసార్లు మనం ఊహించిన వాళ్ళే బయటికి వెళ్తుంటారు.. మరికొన్ని సార్లు మాత్రం అద్భుతాలు జరుగుతుంటాయి. మరి ఈ వారం ఏం జరగబోతుందో..?
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…