Telugu

ప్రమోషన్స్ కు ఇలాంటి వీడియోనా?

‘కింగ్’ నాగార్జున హీరోగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన “ఆఫీసర్” సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, ట్రైలర్, వీడియో సాంగ్ ప్రోమో… ఇలా ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకర్షించకపోవడంతో, తాజాగా ‘ఆఫీసర్ సౌండ్’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసారు వర్మ. అయితే ఇది కూడా ఏ మాత్రం ‘సౌండ్’ చేయలేని స్థితిలో ఉండడం విశేషం.

ADVERTISEMENT

ట్రైనింగ్ లో భాగంగా ఓ రింగ్ లో నాగ్ ఇచ్చిన పంచ్ తో విడుదల చేసిన ఈ వీడియో ఏ విధంగా ప్రభావితం చూపుతుందని వర్మ విడుదల చేసారో ఆయనకైనా తెలుసో లేదో మరి! రవిశంకర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ‘సౌండ్’ ఒక్కటే వినిపించగా, జూన్ 1వ తేదీన ‘ఆఫీసర్’ తమ డ్యూటీని స్వీకరించబోతున్నాడని ఖరారు చేసారు. ఈ సినిమా ఫలితంతో అఖిల్ – వర్మల సినిమా ఫేట్ డిసైడ్ కానుందనేది టాలీవుడ్ టాక్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Karan Johar Sidelined Regina for Being a South Indian?

The debate over Bollywood actresses' comments on South Indian cinema has taken another turn. After…

16 minutes ago

అయ్యో పాపం చెవిరెడ్డి… పులివర్తి సుధా రెడ్డి ర్యాగింగ్!

నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి…

36 minutes ago