
“రాజు గారి గది 2” పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షూటింగ్ లో పాల్గొంటున్న నాగ్, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లొకేషన్ స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు ‘కింగ్.’ తన ఇద్దరు తనయులు చైతూ, అఖిల్ లకు పోటీగా వస్తాడనిపించే విధంగా సింపుల్ లుక్ లో అదరగొట్టేసాడు నాగ్. అందమైన మరియు అంతులేని సముద్రం పక్కన షూటింగ్ ఎంతో బాగుందని చెప్తూ పోస్ట్ చేసిన ఈ ఫోటోలో… నాగ్ చేతికి తాయత్తులు కట్టి ఉండడం గమనించవచ్చు.
ఇప్పటివరకు మన్మధుడిగా యువతరం హృదయాలను, ఓ భక్తుడిగా పెద్దల హృదయాలను గెలుచుకున్న నాగ్, తన గ్లామర్ లుక్ తో త్వరలో దెయ్యాల మనసులను కూడా కొల్లగొడతారేమో? ఏమో… ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు… ఈ సినిమా మరో ఎత్తు అంటూ సినిమా ప్రారంభం రోజునే ‘రాజు గారి గది 2’ గురించి నాగ్ ప్రస్తావించడంతో, ఒక్క అభిమానులే కాదు, నాగ్ కూడా ఈ సినిమా విడుదల కోసం చాలా ఆసక్తికంగా ఎదురు చూస్తున్నారని స్పష్టమైంది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…