
Producer Nagavamsi's confident speech at the Vishwanath & Sons audio launch has become a major talking point among Telugu and Tamil audiences.
నిర్మాత నాగవంశీ ట్రేడ్ మార్క్ స్పీచులకి తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ & క్రేజ్ ఉంటుంది. కేవలం నాగవంశీ చెప్పాడని సినిమాలు చూసే జనాలు కూడా ఉన్నారు. ఆ స్థాయి క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకున్నాడు అతను. అయితే.. లాస్ట్ రెండు మూడు సినిమాల విషయంలో ఆ క్రెడిబులిటీకి డెంట్ పడింది అనుకోండి.
అయితే.. నిన్న కోయంబత్తూర్ లో జరిగిన “విశ్వనాథ్ & సన్స్” ఆడియో లాంచ్ ఈవెంట్ లో నాగవంశీ స్టైల్ స్పీచ్ అక్కడి మీడియాకి, అక్కడి సోషల్ మీడియాకి చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఈయనేంటి ఇలా మాట్లాడేస్తున్నాడు అని అనుకున్నారు చాలామంది.
సాధారణంగా తమిళ నిర్మాతలు మహా అయితే తమ హీరోలకి ఎలివేషన్స్ ఇవ్వడం తప్ప, సినిమా గురించి ఎక్కువగా మాట్లాడరు. అగ్ర నిర్మాత కళానిధి మారన్ మొదలుకొని యువ నిర్మాతల దాకా అందరూ ఫాలో అయ్యే పద్ధతి అది. కానీ.. నాగవంశీ మాత్రం చాలా కాన్సిడెంట్ గా మీకు (తమిళ ప్రేక్షకులకు) ఒక మంచి సినిమా ఇస్తున్నాం. తెలుగులో అల వైకుంఠపురములో ఎలాగో.. తమిళంలో విశ్వనాథ్ & సన్స్ అలాగ అంటూ కంపేర్ చేసి మరీ మాట ఇవ్వడం అనేది చర్చనీయాంశం అయ్యింది.
ఒక ప్రొడ్యూసర్ ఈస్థాయిలో మాట్లాడిన దాఖలాలు తమిళ చిత్రసీమలో లేవు. మరి నాగవంశీ కాన్ఫిడెంట్ స్పీచులను తమిళ ప్రేక్షకులు సీరియస్ గా తీసుకుంటారా? అతడి మాటలు నమ్మి థియేటర్లకి వచ్చే అవకాశం ఉందా? అనేది తెలియాల్సి ఉండగా.. వంశీ తమిళంలో కూడా తన మార్క్ వేస్తుండడం గమనార్హం.
ఇకపోతే.. “విశ్వనాథ్ & సన్స్”ను తొలుత బైలింగువల్ సినిమా అనుకున్నారు తెలుగు ప్రేక్షకులు. సూర్య మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా అని సంబరపడిపోయారు. కట్ చేస్తే.. ఇది తమిళ సినిమా, తెలుగులో డబ్బింగ్ చేస్తున్నాం అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పడం తీవ్రమైన నిర్మాణ కలిగించింది. మరి దాన్ని నాగవంశీ & వెంకీ అట్లూరి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
ఇది తమిళ్ వాళ్లకి #AlaVaikunthapurramuloo లాంటి సినిమా అవుద్ది.
– @vamsi84 / #VishwanathAndSons pic.twitter.com/rd5GXbS8IB
— M9 NEWS (@M9News_) August 2, 2026
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…