
మరి క్రియేటివ్ దర్శకుడిగా పేరుగాంచిన కృష్ణవంశీ సినిమాకు కూడా అదే తరహా ‘బి-గ్రేడ్’ పబ్లిసిటీ అవసరమా? ఈ ఆలోచనలు ఎవరివో గానీ, “నక్షత్రం” సినిమాలోని కంటెంట్ కంటే కూడా, బీచ్ సాంగ్ లో అందాలు ఆరబోసిన హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కేంద్రంగానే చిత్ర పబ్లిసిటీ చేస్తున్నట్లుగా కనపడుతోంది. నిర్మాణ సంస్థ విడుదల చేసిన తాజా పోస్టర్లు ఇందుకు నిదర్శనంగానే నిలుస్తున్నాయి. బీచ్ ఒడ్డున సాయిధరమ్ తేజ్ తో ప్రజ్ఞా జైస్వాల్ ఉన్న రకరకాల భంగిమల పోస్టర్లపై విడుదల తేదీని ముద్రించి విడుదల చేయడం విశేషం.
కృష్ణవంశీ అంటే బీచ్ సాంగ్ ను ప్రేక్షకులు ముందుగానే ఊహించవచ్చు గానీ, పోస్టర్ల విభాగంలో అదే బీచ్ సాంగ్ కేంద్రంగా సినిమా రిలీజ్ పబ్లిసిటీ కేంద్రీకరించడం మాత్రం “నక్షత్రం” సినిమా కంటెంట్ ను పక్కదారి పట్టిస్తుందని చెప్పవచ్చు. యూత్ ను ఆకర్షించడానికి, సినిమా ఓపెనింగ్స్ కోసం ఈ పోస్టర్లు ఉపయోగపడతాయేమో గానీ, సినిమాను నిలబెట్టడానికి మాత్రం కాదు అని చిత్ర యూనిట్ గుర్తుంచుకోవాలి. ఇలా కాకుండా ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ప్రేక్షకులకు అందిస్తే… దీని కంటే ప్రయోజనం ఎక్కువ చేకూరేదేమో..!
The legal pressure on YSRCP leaders is mounting, with the Enforcement Directorate summoning former minister…
Glenn Maxwell's international career has come to an end after 14 years with Australia. The…