
ఏపీలో జగన్ ప్రభుత్వం వైఖరి కారణంగా బిజెపికి రాజకీయంగా అనుకూల పరిస్థితులున్నప్పటికీ దానిని సద్వినియోగించుకొని రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించలేకపోతోంది బిజెపి. గత మూడున్నరేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలలో దాడులు, విగ్రహాల విధ్వంసాలు, దొంగతనాలు జరుగుతున్నాయి. తిరుపతి వంటి పరమ పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారం జరుగుతోంది. చివరికి గంజాయి సరఫరా కూడా జరుగుతోంది. ఇక వైసీపీ ప్రభుత్వం కుంటిసాకులతో వినాయక చవితి, దసరా, దీపావళి వంటి హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తోంది. హిందుత్వ అజెండాతో పనిచేసే బిజెపికి ఇవన్నీ బలమైన ఆయుధాలే. ఇక జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో చిచ్చుపెడుతుంటే, ఏపీ బిజెపి ప్రజల తరపున నిలిచి అమరావతి కోసం పోరాడటంలో విఫలమైంది.
మిత్రపక్షమైన తమతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు కూడా రాష్ట్ర బిజెపి నేతలు ఆసక్తి చూపలేదని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారంటే ఏపీ బిజెపి పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ఏపీ బిజెపి దాదాపు నిద్రావస్థలో ఉండిపోయిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితులలో ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ని ఢిల్లీకి పిలిపించుకొని మళ్ళీ కలిసి పనిచేద్దామని ఒప్పించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని బిజెపిలో చేర్చుకోవడం యాదృచ్చికమని అనుకోలేము.
ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, కుల సమీకరణలు, కుల రాజకీయాలు, వాటి బలాబలాలు, రాష్ట్ర ప్రజల సమస్యలు, ఆకాంక్షలు అన్నీ తెలుసు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన సిఎం జగన్మోహన్ రెడ్డికి అదే సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డితో చెక్ పెట్టాలని బిజెపి పెద్దలు భావించడం సహజం. కనుక ఆయనకు ఏపీ బిజెపి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని భావించవచ్చు.
ఏపీలో బిజెపి, జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నందున కిరణ్ కుమార్ రెడ్డి చేరికకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించకపోయినా ఏపీలో రెడ్డి సామాజిక వర్గంతో సహా వివిద వర్గాల నేతలను, ప్రజలను ఆకర్షించి బిజెపిని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించడం ఖాయం. ఏపీ బిజెపిలో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమిటనేది తేలితే, ఏపీలో రాజకీయ బలబలాలు, సమీకరణల లెక్కలు కూడా తెలుతాయి. కనుక బిజెపిలో ఆయన చేరికపై టిడిపి, వైసీపీలు ఏవిదంగా స్పందిస్తాయో చూడాలి.
MS Dhoni's role at Chennai Super Kings (CSK) has become a talking point ahead of…
After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…