Telugu

NBK – వారసత్వం నుంచి విజయ శిఖరం దాకా

తెలుగునాట తిరుగులేని నట సార్వభౌమత్వాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ పరిశ్రమలో ప్రవేశించేనాటికి పూలబాట స్వాగతం చెప్పలేదు. తాతమ్మకల(1974)తో చేయి పట్టుకుని తండ్రి వేయించిన అడుగులు ఎన్నో సవాళ్ళను విసురుతాయని తెలుసు. అనురాగదేవత వరకు నాన్న నీడలోనే సాగిన ప్రయాణం సాహసమే జీవితం(1983)తో సోలో హీరోగా మొదటి మెట్టుని చూపించింది. కానీ సక్సెస్ రాలేదు.

డిస్కో కింగ్, జననీ జన్మభూమిల రూపంలో వరస ఫ్లాపులు. ఎక్కడో లెక్క తప్పుతోంది. అభిమానుల అంచనాల బరువు అర్థమయ్యింది.
దర్శకుడు కోడి రామకృష్ణ నిర్మాత గోపాల్ రెడ్డిల పరిచయం మంగమ్మ గారి మనవడు(1984) రూపంలో ఇండస్ట్రీ హిట్ తీసుకొచ్చింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. కె విశ్వనాథ్, జంధ్యాల లాంటి ఉద్దండులతో పని చేయడం ఎంతో అనుభవాన్ని ఇచ్చింది.

ADVERTISEMENT

పల్లెటూరి నేపథ్యంలో తీసిన ముద్దుల కృష్ణయ్య, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, అనసూయమ్మ గారి అల్లుడు ఆ పాత్రలను వేరే హీరోలు చేయలేనంత గొప్పగా ప్రేక్షకులను చేరువ చేసింది. అపూర్వ సహోదరులులో డ్యూయల్ రోల్ తో మెప్పించడం మరో మలుపు.
కమర్షియల్ మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో ముద్దుల మావయ్య(1989)తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఒక సంచలనం.

అసలు ఫైట్లే లేకుండా నారి నారి నడుమ మురారి తీసినా, ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ తో ప్రయోగం చేసినా బాలయ్యకే చెల్లింది. టెక్నాలజీ అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లో భైరవ ద్వీపం(1994) సాధించిన విజయం గురించి విజయా సంస్థ ఇప్పటికీ గర్వంగా చెప్పకుంటుంది. ఒకే రోజు బంగారు బుల్లోడు, నిప్పు రవ్వ రిలీజ్ చేయడం లాంటి అరుదైన మైలురాళ్ళు ఎన్నో చేరాయి.

పెద్దన్నయ్య(1997) సక్సెస్ తర్వాత వరస ఫ్లాపులతో సతమతవుతున్న టైంలో సమరసింహారెడ్డి(1999) రూపంలో తొలి ఫ్యాక్షన్ బ్లాక్ బస్టర్ ని అందించడం చరిత్ర మర్చిపోలేదు. దీని తర్వాత రెడ్డి సినిమాలు ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. తిరిగి నరసింహనాయుడుతో హిస్టరీ మరోసారి రిపీట్ అయ్యింది. లక్ష్మి నరసింహ మినహాయించి కొన్నేళ్ల పాటు ఫ్లాపులు క్యూ కట్టినా చెక్కు చెదరని అభిమాన సందోహం ఆకలి తీరేలా బోయపాటి శీను ఇచ్చిన సింహా, అఖండలు కొత్త ఊపిరినిచ్చాయి.

వందో సినిమా గౌతమి పుత్రశాతకర్ణి ఇంకో మేలిమి ఘట్టం. ఎన్టీఆర్ బయోపిక్ కోసం ప్రాణం పెట్టి నటించినా కోరుకున్న ఫలితం దక్కపోయినా అఖండ ఇచ్చిన హుషారు బాలయ్య ఇన్నింగ్స్ ని ట్వంటీ ట్వంటీ స్పీడ్ లోకి తీసుకెళ్లింది. సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్ తో కొత్త ఒరవడి సృష్టించారు. జై బాలయ్య పదం ఒక నినాదంగా మారిపోయింది.

హిందూపూర్ ఎంఎల్ఏగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆరు పదుల వయసు దాటాక కూడా అదే హుషారుతో కుర్ర దర్శకులకు అవకాశాలు ఇస్తూ సరికొత్త పాత్రలతో సిద్ధమవ్వడం ఫ్యాన్స్ కి మాములు కిక్ ఇవ్వడం లేదు. ఉన్నదున్నట్టు మాట్లాడుతూ, బౌన్సర్లు లేకుండా తిరుగుతూ, భోళాతనం నిండిన మనిషిగా బాలయ్య నటనలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా జై అనిపించుకునే విజయ శిఖరం

అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరి టీజర్ సామాన్య ప్రేక్షకులకూ నచ్చేసింది. ఫ్లాప్ ఎరుగని అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ తోనే పటాస్ రేంజ్ మాస్ ని పండిస్తే ఇక బాలయ్యతో చేయబోయే విధ్వంసం గురించి వేరే చెప్పాలా. సితార సంస్థలో త్రివిక్రమ్ భాగస్వామ్యంలో బాబీ దర్శకత్వంలో మొదలుకాబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ బాలయ్య మార్కుతోనే ఉండనుంది. ఇవే కాదు అన్ స్టాపబుల్ సీజన్ 3, వచ్చే ఏడాది ఎన్నికల ప్రచారపర్వం ఇలా బోలెడు బాధ్యతలతో రెట్టింపు హుషారుతో బాలయ్య సిద్ధమవుతున్నారు

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Retro Fever Takes Over Tollywood

The 80s seem to be back in Tollywood. A trend that started on social media…

17 minutes ago

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో 3 లక్షల బాలికలకు HPVపై అవగాహన

సాధారణంగా ఫ్యాన్ అసోసియేషన్లు సినిమా రిలీజ్‌లు, వేడుకలు, హీరోల పుట్టినరోజు కార్యక్రమాలకే పరిమితమవుతుంటాయి. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

20 minutes ago