
ఈ సందర్భంగా ఆయన తనదైన స్టైల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనకెవరూ పోటీ లేరని, తన సినిమాలే తనకు పోటీ అని ఆయన పేర్కొన్నారు. రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలుకొట్టాలన్నా తమకే సాధ్యమని కూడా ఆయన ప్రకటించారు. 99 సినిమాల కృషి ఫలితమే వందో సినిమా అని, తన వందో చిత్రంపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలు నెరవేరేలా పనిచేస్తానని బాలయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బాలయ్య ప్రస్తావించారు. దేశం మొత్తాన్ని ఏకచ్ఛాత్రాదిపత్యంగా ఏలిన చక్రవర్తిగా శాతకర్ణిని అని, శాతకర్ణి యుద్ధాలు చేసింది శాంతిస్థాపన కోసమేనని అభివర్ణించారు. శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తన తండ్రి దివంగత నందమూరి తారక రామారావు సినిమా తీయాలనుకున్నారని, కానీ కొన్ని కారణాలతో తీయలేకపోయారన్నారు. అంతకుముందు విజయవాడలోని గౌతమీపుత్ర శాతకర్ణి విగ్రహానికి నివాళులర్పించిన బాలయ్య నేరుగా వేదిక వద్దకు చేరుకున్నారు.
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…