
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కూడా సినీ అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. అయితే తెలంగాణా సిఎం ప్రకటించిన విధివిధానాలతో సంతృప్తిగా ఉన్న పరిశ్రమ వర్గాలు షూటింగ్ లు ఎక్కువగా హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఒక్క అరకు ప్రదేశంలో తప్ప రామానాయుడు స్టూడియో, బీచ్ లొకేషన్స్ కొలువు తీరి ఉన్న విశాఖలో కూడా ఆశించిన స్థాయిలో షూటింగ్స్ జరగడం లేదు. దీంతో ఏపీ ప్రభుత్వం తరపున సినీ పరిశ్రమలో ఒక ప్రతినిధి ఉండాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగా తెలుగు పరిశ్రమలో అగ్ర స్థాయిలో ఉన్న బాలకృష్ణను మంత్రి చేయాలనే నిర్ణయానికి సిఎం వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తన వద్దే ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ శాఖను బాలయ్యకు కేటాయించి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావిస్తున్నారట. మరి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి బాలకృష్ణకు మంత్రి పదవి వరిస్తే, బలయ్యకున్న సినీ అనుబంధం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…