
అయితే టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం బీజేపీని విమర్శించడం గమనార్హం. ఈరోజు సెహరి అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన హిందూపూర్ ఎమ్మెల్యే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ చేసే మత రాజకీయాలను టార్గెట్ చేసారు ఆయన.
“ఇప్పుడు రామ అయోధ్య అయింది.. ఇక ద్వారక మీద పడబోతోంది బీజేపీ. సముద్రంలోని కృష్ణుడిని బయటకు తీయబోతోంద”ని బాలయ్య వ్యాఖ్యానించారు. సహజంగా ఏదైనా మాట్లాడే ముందు లెక్కలు వేసుకుని మాట్లాడని ఆయన బీజేపీ మీద కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టారు.
“బాలయ్య ముక్కుసూటి మనిషి… అధికార పక్షం కూడా బీజేపీ అంటే భయపడుతుంటే ఓపెన్ గా వారి విధానాలను విమర్శించిన ఒక్క మగాడు,” అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇది ఇలా ఉండగా.. సెహరి అనే సినిమా ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు హర్ష్ హీరోగా పరిచయం అవుతున్నాడు.
Vishwak Sen is heading into an unusual phase of his career. Not because he has…
Avengers Endgame is proving that a film does not always need a new release to…