
సింహా సెంటిమెంట్ కలిసొస్తే బాలయ్య ఖాతాలో ఇంకో హిట్ పక్కా అని కొందరు అభిమానులు సంబరపడిపోతున్నారు. ఫైట్ మాస్టర్లు అన్బు, అరవి నేతృత్వంలో ఆ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. వారికి ఇటీవలే కేజీఎఫ్ తో నేషనల్ అవార్డు వచ్చింది. ప్రకాష్‌రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్ భట్. సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ చిత్రబృందం క్రిస్మస్ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
బాలయ్య, కేఎస్ రవికుమార్ మొన్న ఆ మధ్య జయసింహ అనే సినిమా చేశారు. ఆ సినిమా లో పెద్దగా విషయం లేకపోయినా సంక్రాంతి సెలవుల వల్ల ఆడింది. అయినా అటువంటి దర్శకుడికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. దీనితో సినిమాపై అభిమానులకు ఒకింత అనుమానంగానే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలు ప్లాప్ గా మిగిలిపోవడంతో నందమూరి అభిమానులు ఒకింత నిరాశగా ఉన్నారు. మరి ఈ సినిమాతో వారికి ఏం రాసిపెట్టి ఉందొ చూడాలి.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…