
ముఖ్యంగా తన మీద తానే సెటైర్లు వేసుకోవడంతో బాలయ్య బాబు దిట్ట అన్న విషయం మరోసారి రుజువైంది. తాను నటించిన సినిమాలలో నీకు అనిపించిన ‘బెస్ట్’ మూవీ ఏంటి అని నానిని అడగగా, ‘ఆదిత్య 369’ అని బదులిచ్చారు. అలాగే ‘రాడ్డు’ సినిమా ఏదని ప్రశ్నించగా, ‘పలనాటి బ్రహ్మనాయుడు’ అని జవాబివ్వగానే, ‘తొడకొడితే ట్రైన్ వెళ్లిపోయే సినిమానే’ కదా అంటూ నవ్వేసారు.
హీరో కధను డామినేట్ చేస్తే అలాంటి సీన్లే వస్తాయని అన్న బాలకృష్ణ, ఇలా తొడకొట్టుకుంటూ ఉంటుంటే, డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు చూస్తే ఎర్రగా వాచిపోయి ఉంటుందని, బహుశా తొడ కొట్టడానికి ‘బ్రాండ్ అంబాసిడర్’గా మారిపోయానేమోనని తన మీద తానే సెటైర్లు వేసుకున్నారు బాలయ్య. కల్మషం ఎరుగని బాలయ్యను ఇలా చూస్తూ మురిసిపోవడం అభిమానుల వంతవుతోంది.
Naazukmadanlochan brings a breezy dose of beachside glamour to this striking black beachwear showcase. Her…
The second film is often where the real test begins for a young director. A…