Telugu

మాస్ మాసాలా వీరసింహారెడ్డి గెలుపు ఛాన్స్ ఎంత

సంక్రాంతి సినిమా అంటే తెలుగు బాక్సాఫీస్ మాస్ గా మారిపోతుంది. పండగ వాతావరణంలో స్నేహితులతో కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్లడమంటే సగటు తెలుగువాడికి అదో చెప్పలేనంత ఆనందం. అందుకే ఏడాది మొత్తం ఎప్పుడూ లేనంత రద్దీలు అప్పుడే కనిపిస్తాయి. ఇది ఇప్పటి చరిత్ర కాదు. ఎన్టీఆర్ దానవీరశూకర్ణ కృష్ణ కురుక్షేత్రంతో మొదలుపెట్టి ఇంకొద్ది రోజుల్లో ఢీ కొట్టబోయే చిరంజీవి వాల్తేరు వీరయ్య బాలయ్య వీరసింహారెడ్డి దాకా ఇది దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. అందులోనూ నిన్నటి తరం అతి పెద్ద స్టార్లు తలపడుతుంటే అంతకంటే సందడి వేరే ఇంకేముంటుంది.

వీరసింహారెడ్డి ట్రైలర్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో అచ్చంగా వాళ్ళ కళ్ళతో చూసినట్టు దర్శకుడు గోపిచంద్ మలినేని వాటినే అందులో పొందుపరిచాడు. సీమ జనాలు కత్తులు పట్టకూడదని తనే బలిదేవుడిగా ముందు నిలబడే పాత్రలో బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ మాములుగా లేదు. క్రాక్ నుంచి ఊర మాస్ బాణీలోకి వెళ్ళిపోయిన సంభాషణల రచయిత సాయి మాధవ్ బుర్రా ఇందులో తన కలానికి మరింత పదును పెట్టడమే కాదు అధికారంలో ఉన్న సర్కారుకి నేరుగా తగిలేలా పవర్ ఫుల్ చురకలు వేశారు. సంతకం పెడితే బోర్డు మారొచ్చు కానీ మనిషి చరిత్ర కాదనే కౌంటర్ దేని గురించో సులభంగా అర్థం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

పాజిటివ్ టచ్ ఉన్న పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ గా బాలయ్యని మించిన విగ్రహం లేదనే అభిమానుల కామెంట్ ని కొట్టిపారేయలేం కానీ వీరసింహారెడ్డి రెగ్యులర్ ఫార్ములాలోనే వెళ్లిందనే మాటలను తీసిపారేయలేం. ఉదాహరణకుకు మాంగల్యం ఉన్నా ముండమోపిగా బ్రతకాల్సి వచ్చిందన్న వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర నరసింహనాయుడులో తెలంగాణ శకుంతలను గుర్తుకు తెస్తే విలన్ దునియా విజయ్ క్యారెక్టర్ లెజెండ్. సింహా టైపులో గతంలో చూసిందే. అలా అని ఇలాంటి అంశాలను తక్కువంచనా వేయడానికి లేదు. అసలు ఇందులో ఒక్క బాలయ్యనా డబుల్ రోలా అనేది క్లారిటీ ఇవ్వకుండా తెలివిగా కట్ చేశారు.

ఏది ఏమైనా మాస్ కంటెంట్ ని ఎప్పుడు ఎలాంటి మేజిక్ చేస్తుందో చెప్పలేం. ఇటీవలే వచ్చిన ధమాకా ఊహకందని ఫలితం ఎలా అందుకుందో చూశాంగా. రొటీన్ అనిపించుకున్నా వసూళ్లు అదరగొట్టేసింది. వీరసింహరెడ్డిని మరీ ఆ గాటన కట్టలేం కానీ బాలయ్య రేంజ్ స్టేచర్ ఉన్న హీరోని సరైన ఎలివేషన్లతో కనక చూపించగలితే బ్లాక్ బస్టర్ ఖాయమని బి గోపాల్ తర్వాత ఒక్క బోయపాటి శీను మాత్రమే పదే పదే ఋజువు చేయగలిగాడు. ఇప్పుడు గోపీచంద్ మలినేని వీళ్ళ సరసన చేరతాడో లేదో 12న తేలనుంది. సమరసింహారెడ్డి ఫ్యాన్ గా తీశానని చెబుతున్న ఇతను ఫలితం కూడా అదే తెస్తాడా.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IND vs WI 5th T20: Rain Washes Out Decider, Trophy Shared

The fifth T20I between India and West Indies was washed out due to rain at…

25 minutes ago

Why Ranabaali Raises Big Doubts on Prabhas’ Fauzi?

Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…

1 hour ago