Telugu

హరికృష్ణ ఎదురుదెబ్బలు తిన్నారా… ఎవరి చేతిలో..?

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన “ఇజం” ఆడియో వేడుకను చాలా సింపుల్ గా విడుదల చేసారు. రొటీన్ గా ఉండే అభిమాన జన సందోహం నడుమ కాకుండా, చిత్ర యూనిట్, సన్నిహిత వర్గం, పాత్రికేయుల నడుమ “ఇజం” ఆడియో విడుదలైంది. ఈ ఆడియో వేడుకకు విచ్చేసిన హరికృష్ణ చాలా ఏమోషనల్ గా ఫీల్ అయ్యారు.

ADVERTISEMENT

ఎంత ఏమోషనల్ అంటే… ఉన్నది ‘ఇజం’ సినిమా ఆడియో వేడుక అన్న సంగతిని కూడా మరిచిపోయి, నాటి ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకురావడం మొదలుపెట్టారు. అయితే తర్వాత కాసేపటికి కుదురుకున్న హరికృష్ణ, ‘ఇజం’ సినిమా గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలోనే పూరీ జగన్నాధ్ ఇంటికి వెళ్ళిన సందర్భంలో… పూరీ భార్య ఇచ్చిన కాఫీ తన జీవితంలోనే అద్భుతమైన కాఫీ అని, ఏదైనా మనసులో ఉంటే తానూ దాచుకోలేనంటూ… ఓ భారీ డైలాగ్ లను కూడా వేసారు హరికృష్ణ.

“నేనెప్పుడూ మనసులో మాట చెప్తాను… మనసులో మాట దాచుకోలేను… అది జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా… నేవర్ తలవంచే ప్రశ్నే లేదు… తలవంచే వాడ్నే నందమూరి తారక రామారావు కడుపున పుట్టుండే వాడ్ని కాదు… అంటూ ఓ భారీ డైలాగ్ వేసారు. ఆయన మాకు ఇచ్చింది తలవంచి బ్రతకడం కాదు… కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు… అలాగే ఆయన బాటలో బిడ్డలు కూడా వెళ్తున్నారంటూ…” చెప్పుకొచ్చారు.

అయితే హరికృష్ణ ఎవరిని ఉద్దేశించి ఆ కీలక వ్యాఖ్యలు చేసారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు చేసేటపుడు ఒక్కసారిగా ఉత్తేజంతో, పౌరుషంతో హరికృష్ణ మాట్లాడడం వీక్షకులు గమనించేదే. మరి అంతలా హరికృష్ణ చెలరేగిపోవడం వెనుక మనసులో ఏం దాచుకున్నారో? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మనసులో ఏం దాచుకోలేను… ఉన్నది నిర్మొహమాటంగా చెప్పేస్తాను అని చెప్పే హరికృష్ణ మనసులో నిజంగా ఏముంది? ఎవరిపై విరోధం ఉంది? బయటకు చెప్పకపోయినా దీనికి జవాబు అందరికీ తెలిసిందే అనుకుంటా..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Allu Arjun-Prabhas Title War: Forbes Quietly Took U-Turn?

Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…

6 hours ago

Allari Naresh: Nervous But Happy With The Response

For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…

6 hours ago