
మెగా కాంపౌండ్ వేదికగా జరుగుతున్న రచ్చ వెనుక ఏదో “పెద్ద తలకాయ” ఉండి ఉంటుందని, వాళ్ళే వీరిని ముందు పెట్టి ఆడిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. పేరుకు మాత్రం “మనం” సినిమాకు అవార్డు రాలేదని, “రుద్రమదేవి”ని పరిగణించలేదని ఆక్రోశం వెలిబుచ్చుతున్న వీరి ఆవేశం అంతా “గోవిందుడు అందరి వాడేలే, రేసుగుర్రం” చిత్రాలకు ఎందుకు ఇవ్వలేదు? ఇదే సమయంలో “లెజెండ్” సినిమాకు ఎందుకు ఇచ్చారు? అన్న ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి.
ముఖ్యంగా బాలకృష్ణపై ఉన్న ఆక్రోశం అంతా ఈ నంది అవార్డుల వేదికగా బహిర్గతమవుతున్నట్లుగా కనపడుతోంది. “లెజెండ్” సినిమాకు ఏ ప్రాతిపాదికన 9 అవార్డులు ఇస్తారంటూ నల్లమలపు బుజ్జి నేరుగా ప్రశ్నించడం తోడు, వీటిని కమ్మ అవార్డులుగా పేర్కొనడం చూస్తుంటే… ఈ చిన్న తలకాయల వెనుక ఖచ్చితంగా ఓ “భారీ తలకాయ” ఉందన్న విషయం అయితే స్పష్టమవుతోంది. జరుగుతున్న ఈ రచ్చతో ప్రభుత్వం మళ్ళీ “రేసు”లోకి వచ్చి ఆ “గుర్రానికి” అవార్డు ప్రకటిస్తుందేమో..!?
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…