Telugu

నాని ‘ఆట’ మొదలైంది!

బిగ్ బాస్ సీజన్-2లో అసలు మజా మొదలైంది. ‘ఏమైనా జరగొచ్చు’ అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభమైన ఈ సీజన్ మూడో వారానికి ప్రవేశించగా, కెప్టెన్ టాస్క్ లో భాగంగా కిరీటి గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నాడని హోస్ట్ చేస్తోన్న నాని శనివారం నాటి ఎపిసోడ్ లో అందరినీ ఓ ఆట ఆదుకున్నాడు. అమ్మాయిల తరఫున మాట్లాడుతూ… ఇతర కంటెస్టెంట్ ల ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలను కిరీటి చేస్తున్నాడని, అదేమైనా మగతనమా? అని ప్రశ్నించాడు.

ADVERTISEMENT

మాటలతో బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నావని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇక తొలి రోజు నుంచి ఓ గ్రూప్ గా ఏర్పడిన కొందరు తన ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని మరో కంటెస్టెంట్ కౌశల్ ఆరోపించాడు. తనకిచ్చిన టాస్క్ లో భాగంగా ఓ పని చేస్తే, పదేపదే దాన్ని ఎత్తి చూపుతున్నారని, హౌస్ లోని వాళ్లు కనీస మానవతా విలువలను చూపించడం లేదని, అందరిదీ కపట ప్రేమేనని అన్నాడు. ఈ ఎపిసోడ్ లో కౌశల్, తనీష్ ల మధ్య ఉన్న విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

శుక్రవారం నాడు దాదాపు కొట్టుకునేంత పని చేసిన వీరు, నిన్న కూడా తమ వైఖరిని మార్చుకోలేదు. ఇక ‘బిగ్ బాస్’పై నిప్పులు చెరిగిన గోగినేని బాబును నాని ప్రశంసించాడు. ఆటగాళ్లకు గాయాలవుతుంటే బిగ్ బాస్ నిర్లక్ష్యంగా ఎలా ఉంటాడని ప్రశ్నించిన గోగినేని, మంచి పనే చేశారన్న నాని, ఇకపై చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పాడు. మొత్తమ్మీద తొలి రెండు వారాలను మించిన స్థాయిలో నాని హోస్టింగ్ ఉందన్న టాక్ ను సొంతం చేసుకున్నాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

ఈ బాబు ఎప్పుడూ ఇంతే… ముప్పై ఏళ్ళ ముందుంటారు!

పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్లు ముఖ్యమంత్రులలో దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రులు కూడా వేరేగా ఉంటారు. ఆ కోవకు చెందినవారే…

54 minutes ago

Brutal Blow To Jagan, Is KTR Next?

YS Jagan and KTR publicly refer to each other as brothers, and the two of…

1 hour ago