
ముఖ్యంగా ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే సభ్యుల ఇంట్రడక్షన్ విషయంలో నానిలో ఏ మాత్రం ఫ్లో లేదు. జస్ట్ పరిచయం అయిన తర్వాత ‘ఏవీ’కి వెళ్లిపోదాం అంటూ చెప్పిన నాని, వీడియో ముగిసిన తర్వాత ఓ రెండు ముక్కలు మాట్లాడి వారిని హౌస్ లోకి పంపించేసారు. కెరీర్ లో చేస్తోన్న తొలి షో కావడంతో, కాస్త క్లారిటీ మిస్ అవ్వడం కామన్ గానీ, మున్ముందు ఇంకా మెరుగవ్వాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది.
ముఖ్యంగా సమయస్పూర్తితో వ్యవహరించడం, అందులో నుండి ఫన్ క్రియేట్ చేయడం జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన బలాలు. బహుశా రియల్ లైఫ్ లో నానికి కూడా ఇవి ఉండవచ్చు గానీ, దానిని స్మాల్ స్క్రీన్ పైన కూడా పెట్టగలిగితేనే, నానికి తగిన పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. ఒక్కసారి అలవాటైతే నాని ఏ రేంజ్ లో రెచ్చిపోతారో వెండితెరపై చూసాం, దానిని బుల్లితెరపై చూడడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ నాచురల్ స్టార్ నాచురల్ గా ప్రవర్తిస్తే చాలు!
Vishwak Sen is gearing up for the release of his slasher action entertainer, Cult. The…
Unemployment had been one of the major concerns in the Indian society for a really…