Telugu

మట్టివాసన ప్రేమల్లో ప్రతీకారపు దసరా

ప్రేక్షకులను మెప్పించాలంటే కనివిని ఎరుగని కొత్త కథలే అక్కర్లేదు. ముఖ్యంగా మాస్ ని టార్గెట్ చేసుకున్నప్పుడు ఎలివేషన్లు, డ్రామా సరిగ్గా పండేలా కుదిరి వాటిని సులభంగా మోయగలిగే హీరో దొరికినప్పుడు ఆటోమేటిక్ గా బ్లాక్ బస్టర్ పడిపోతుంది. నానిని ఎప్పుడూ చూడని ఊర మాస్ దసరా పోస్టర్ లో చూసినప్పుడు కాసింత అనుమానం. ఇదేదో పుష్ప లాగా ఉందని పోలికలు తెచ్చినవాళ్లున్నారు. ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్న నానిని ఇలాంటి వేషంలో అంగీకరిస్తారాని అనుమానించారు . ఏది ఎలా ఉన్నా స్క్రీన్ మీద బొమ్మ పడ్డాక రెండున్నర గంటలకు న్యాయం జరిగితే చాలు ఇవన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. నిజంగా దసరా అంత మేజిక్ చేసిందా.

ముప్పై నలభై ఏళ్ళు వెనక్కు తీసుకెళ్లి అప్పటి నేపధ్యాలతో కథలు రాసుకోవడం ఇప్పటి ఫిలిం మేకర్స్ నయా ఫార్ములా. సుకుమార్ రంగస్థలంతో దీన్ని పరిచయం చేశాక శిష్యులూ అదే ఫాలో అవుతున్నారు. దసరా 1995లో జరుగుతుంది. వీర్నపల్లె అనే ఊరిలో ధరణి(నాని) సూరి(దీక్షిత్ శెట్టి) ప్రాణ స్నేహితులు. సూరి గర్ల్ ఫ్రెండ్ వెన్నెల(కీర్తి సురేష్). మందు తాగడమే ప్రపంచంగా భావించే ఆ పల్లెటూరిలో సర్పంచ్ కొడుకు చిన్ననంబి(షైన్ టామ్ చాకో)వల్ల వీళ్ళ జీవితంలో అలజడి మొదలువుతుంది. అప్పటిదాకా బొగ్గు దొంగతనం తప్ప ఇంకే పని తెలియని ధరణిలో ప్రతీకార జ్వాల రేగుతుంది. కల్లు తాగే ధరణి కత్తి ఎందుకు పట్టాడనేదే కథ.

ADVERTISEMENT

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకున్న స్క్రిప్ట్ లో కొత్తదనం లేదు. కానీ ఎంచుకున్న నేపథ్యంలో, సెట్ చేసుకున్న ప్రెజెంటేషన్ టోన్ లో, తెరమీదే ఇంటెన్సిటీతో యాక్షన్ ని చూపించాలన్న ఆలోచనలో క్రియేటివిటీ ఉంది. మొదలైనప్పటికీ వీర్నపల్లెలో తిరుగుతున్న ఫీలింగ్ కలిగిస్తూ మనం చూస్తున్నది మరీ గొప్ప కథేం కాదన్న నిజాన్ని మర్చిపోయేలా చేస్తాడు. ధరణి సూరి వెన్నెల పాత్రలు ఎస్టాబ్లిష్ చేసిన తీరు, ఇంటర్వెల్ బ్లాక్ ముందు వరకు నడిపించిన వైనం కుదుపులకు లోనైనప్పటికీ ఓ మూడు సీన్లు చప్పగా అనిపించడం ఆలస్యం వెంటనే మరో సన్నివేశంతో హై ఇచ్చేస్తాడు. సెకండ్ స్లో అయ్యిందనుకుంటే ప్రీ క్లైమాక్స్ నుంచి గేరే మారిపోయి ఫైనల్ గా గుడ్ అనిపిస్తుంది.

నాని విశ్వరూపమే దసరాలో వీక్ నెస్ లను దుప్పటి కింద కప్పేసింది. కీర్తి సురేష్ తనకు దన్నుగా నిలబడింది. సూరి పాత్ర నిడివి పరిమితం కాబట్టి ఉన్నంతలో మెప్పించేసి వెళ్ళిపోతాడు. సంతోష్ నారాయణన్ సంగీతం దసరాకున్న మరో ప్రధాన అస్త్రం.ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, ఫైట్లు అన్ని విభాగాలు ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయి. శ్రీకాంత్ ఓదెల మీద సుకుమార్ ప్రభావం గట్టిగానే ఉంది. సీన్లను పేర్చుకునే క్రమంలో, స్క్రీన్ ప్లే మీదున్న పట్టులో అది కనిపిస్తుంది. అయితే ఫ్యామిలీ జనాలకు దసరా కనెక్ట్ కావడం అనుమానమే. ఒకవేళ నెమ్మదిగా సాగినా ఇలాంటి రియలిస్టిక్ డ్రామాలు నచ్చుతాయనుకుంటే దసరాని ట్రై చేయొచ్చు. అది కూడా కమర్షియల్ మీటర్ లో విపరీతమైన అంచనాలు లేకుండానే సుమా.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay-Modi’s Metro Ride Turns Generational Meme Content?

Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…

12 minutes ago

Vijay Deverakonda vs Rajni: Can Ranabaali Make It 3-0?

Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…

43 minutes ago