
తొందరలో తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. క్లాష్ అయితే ఇరు సినిమాల ఓపెనింగ్స్ కొంత మేర తగ్గవచ్చు. ఆ ఉద్దేశం కూడా వారు ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించి ఉండొచ్చు. గ్యాంగ్ లీడర్ ఐదుగురు ఆడవారి గ్యాంగ్ తో ముందుకు సాగే ఒక క్రైమ్ కామెడీ. కామెడీ బాగా వర్కు అవుట్ అయ్యిందని సమాచారం. గ్యాంగ్ లీడర్ గనుక వాయిదా పడితే అది వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాకు కలిసి వచ్చేదే అని చెప్పుకోవాలి.
గ్యాంగ్ లీడర్ చిత్రం తొలుత ఆగష్టు 30న విడుదల కావాల్సి ఉంది. అయితే ఆగష్టు 15న విడుదల అవ్వాల్సిన ప్రభాస్ సాహూ చిత్రం 30కు వాయిదా పడటంతో గ్యాంగ్ లీడర్ కు రిలీజ్ డేట్ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇటీవలే జెర్సీ తో హిట్ కొట్టిన నాని ఈ సినిమాతో కూడా తన విజయపరంపరను కొనసాగించాలని ఆసక్తిగా ఉన్నారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి(సీవీఎం) నిర్మిస్తున్నారు.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…