Telugu

ఒకే రోజున రెండు వెరైటీ సినిమాల ప్రకటన

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే రోజు రెండు వెరైటీ సినిమాల ప్రకటన వెలువడింది. నిర్మాతగా మారిన నాని తన మొదటి సినిమా అ! తో కమర్షియల్ సక్సెస్ తో పాటు జాతీయ అవార్డుకు సాధించాడు. ఇప్పుడు నిర్మాతగా తన రెండో సినిమా కూడా ప్రకటించాడు. ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలలో హీరోగా చేసిన విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు.

‘హిట్’ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రుహాని శర్మ విశ్వక్ సేన్ పక్కన జంటగా నటిస్తుంది. బ్లడ్ అండ్ ఫైర్ తో కూడిన విశ్వక్ లుక్ చూస్తుంటే ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ప్రకటించిన నాడే ఈ సినిమాపై మంచి అంచనాలే వచ్చేశాయి.

ADVERTISEMENT

ఇక రెండో చిత్రం విషయానికి వస్తే … మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా మారుతున్నాడు. ‘జాతిరత్నాలు’ అనే విభిన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించడం విశేషం. 420, 210,840 నంబర్లు కలిగిన ఖైదీ దుస్తులు ధరించి ఉన్న నవీన్, ప్రియదర్శి, రాహుల్ లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.

హిలేరియస్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ 75% పూర్తి అయ్యిందట. ఇక ఈ చిత్రానికి అనుదీప్ కెవి దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. ఒకే రోజు టాలీవుడ్ లో రెండు వెరైటీ సినిమాల ప్రకటన రావడం విశేషం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas Appreciates 418, Wishes for Its Success

Prabhas shares a good rapport with Prashanth Neel and has appreciated his latest presentation, 418,…

9 minutes ago

Prabhas and Sandeep Reddy Vanga Gear Up for Spirit

Prabhas is working with director Sandeep Reddy Vanga for the action film Spirit. The movie…

27 minutes ago