
యుఎస్ మార్కెట్ లో “నిన్ను కోరి” సినిమాతో మరో 1 మిలియన్ మార్క్ ను అందుకుని, ఆ క్లబ్ లో తన సినిమాల సంఖ్యను నాలుగుకు పెంచుకుని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల సరసన నిలబడ్డాడు. పవన్ ఖాతాలో “గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు” సినిమాలు నిలువగా, ఎన్టీఆర్ ఖాతాలో “బాద్ షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్” సినిమాలు 1 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి.
ఇక నాని ఖాతాలో “ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి” సినిమాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ నుండి లాభాల బాటలో ‘నిన్ను కోరి’ పయనిస్తోందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. భారీ లాభాలను మిగల్చకపోయినప్పటికీ, ‘డీజే’ మాదిరి భారీ నష్టాలను కూడా మిగల్చకపోవడం చెప్పుకోదగ్గ విషయం. దీంతో ‘బాహుబలి 2’ తర్వాత యుఎస్ మార్కెట్ లో ‘నిన్ను కోరి’తో నాని తొలి విజయపు జెండా ఎగుర వేసినట్లయ్యింది.
Pakistan have made several changes to their Test team during the England series, and former…
Allari Naresh is ready to entertain audiences worldwide on September 4th with his upcoming socio-fantasy…