Telugu

ఈ గ్యాప్ నాని కి ‘సరిపోద్దా’..?

తాజాగా థియేటర్లలో సందడి చేస్తున్న వివేక్-నాని జోడి ల రెండవ చిత్రం “సరిపోదా శనివారం” టాక్ పరంగా సరిపోయింది అన్నట్టుగా వచ్చినప్పటికీ వసూళ్ళలో మాత్రం సరిపోదు అంటూ మాస్ రాంపేజ్ చూపిస్తోంది. స్టోరీ రొటీన్ గా ఉండటం, కథనం అంచనా వేసేలా ఉండటం వంటి అంశాల వల్ల ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ADVERTISEMENT

అయితే, సినిమాలో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ రెగ్యులర్ కమెర్షియల్ మూవీ అవ్వటం, నాని, ఎస్.జె.సూర్య యాక్షన్ కు, జాక్స్ బిజోయ్ సంగీతం తోడవటం తో ఫాన్స్ కు థియేటర్లలో పూనకాలే తక్కువ. డైరెక్టర్ వివేక్ తన మొదటి మాస్ సినిమా ను బాగానే హేండిల్ చేసారంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

అన్నిటికన్నా సినిమా కు సంగీతం అందించిన సంగీత దర్శకుడు ‘జేక్స్ బిజోయ్’ నిజంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాలో శివ తాండవం ఆడారనే చెప్పాలి. అయితే, ప్రీ బుకింగ్స్ మరియు మౌత్ టాక్ మీద సినిమా జనాల్లోకి బాగా వెళ్ళింది. ఈ సినిమా కలెక్షన్లు ఏకంగా ‘నాని ను బాబు’ కు అతి చేరువ కు తీసుకెళ్లి పోయింది.

సంగతి ఏంటంటే, టాలీవుడ్ లో ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన 28 సినిమాలకు గాను, 12 సినిమాలు అమెరికా లో 1 మిలియన్ కు పైగా కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీ లో ఇన్ని 1 మిలియన్+ వసూళ్లు ఉన్న ఏకైక హీరో సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’.

అయితే, ఈ మార్క్ కు నాచురల్ స్టార్ ‘నాని’ ఎంతో దూరం లో లేరు. ‘సరిపోదా శనివారం’ తో USA లో మళ్ళీ 1 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకున్నారు నాని. ఇప్పటికే ఆయన నటించిన ఈగ, భలే భలే మగాడివోయ్, ఎం.సి.ఏ, జెర్సీ, అంటే సుందరానికి.., హాయ్ నాన్న, దసరా, నిన్ను కోరి, నేను లోకల్ వంటి చిత్రాలు 1 మిలియన్+ మార్క్ ను అందుకున్నాయి.

అయితే ‘సరిపోదా శనివారం’ రెండవ రోజే ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదల అవ్వటం, నాని-వివేక్ ల కాంబో లో రెండవ చిత్రం కావటం, జెక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇలా విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా వసూళ్లను రాబట్టడంతో నాని తన సినిమాలలో 10 సినిమాలకు 1 మిలియన్ మార్కు వసూళ్లను రాబట్టి ఇప్పుడు సూపర్ స్టార్ కు కేవలం రెండు అడుగులు వెనకున్నాడు.

ఇక తెలుగు ఇండస్ట్రీ ఇతర హీరోలు అయిన పవన్ కళ్యాణ్-7,ఎన్టీఆర్ -7, ప్రభాస్-5, అల్లు అర్జున్-5, చిరంజీవి-4, బాలకృష్ణ-4,వరుణ్ తేజ్-4, విజయ్-4 సినిమాలతో నాని వెనుక ఉన్నారు ఈ స్టార్స్. అయితే ఇప్పుడు ఇంకా కనీసం సెట్స్ పై కి కుడా వెళ్ళని మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ షురూ అయ్యి, విడుదలయ్యే పాటికి నాని ఈ ’12’ సంఖ్యను దాటేస్తాడు కూడా అనేది నెటిజన్ల అభిప్రాయం.

చూడాలి మరి బాబు-రాజమౌళి చిత్రం థియేటర్లకు వచ్చే లోపే సూపర్ స్టార్ పేరిట ఉన్న ఈ రికార్డులను నాచురల్ స్టార్ పేరిట మార్చుకోవడానికి నానికి ఈ సమయం సరిపోతుందా? లేదా? నాని తన సినిమా స్టామినా స్థాయిని రోజురోజుకి పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో నానికి ఈ సమయం సరిపోతుంది అంటున్నారు నాని ఫాన్స్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వల్లభనేనికి ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదే!

మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 5నెలలు జైల్లో ఉండి వచ్చినా ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. తన అనుచరులతో…

3 minutes ago

Industry Talk: Maruthi Eyes a Quirky Comedy Entertainer

After a bitter experience with The Raja Saab, director Maruthi is heading back to his…

10 minutes ago