
దర్శకుడు శివ నిర్వాణ కధ చెప్తున్నపుడు నా మనసుకు బాగా దగ్గరైనట్లుగా అనిపించిందని, మరో పది నిముషాల్లో ముగుస్తుందని భావించగా, ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని, చెప్పిన కధను యధావిధిగా స్క్రీన్ పైన పెట్టాడని తెలిపారు. ఈ ‘నిన్ను కోరి’ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుల ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో నీళ్ళు వచ్చిపోతుంటాయని చెప్పుకొచ్చారు నాచురల్ స్టార్.
ఒకప్పుడు ప్రేక్షకులు కధ గురించి మాట్లాడుకునేవారు, ప్రస్తుతం కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు, అది చూస్తే చాలా బాధగా ఉంటుందని, కలెక్షన్ల గురించి మాట్లాడితే అందరూ కమర్షియల్ సినిమాలే తీస్తారు, అప్పుడు కధ చచ్చిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల విడుదలైన ‘డీజే’ ప్రభావంతో మరోసారి కలెక్షన్ల విషయం రచ్చ రచ్చ మారిన నేపధ్యంలో, నాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
సహజంగా వివాదాలకు దూరంగా ఉండే నాని, ‘డీజే’ను ఉద్దేశించి చెప్పి ఉండకపోవచ్చు గానీ, వర్తమాన ట్రేడ్ పరిస్థితులు అందుకు అనుగుణంగా మాత్రం ఉన్నాయి. ఆ మాటకొస్తే… ఒక్క ‘డీజే’ మాత్రమే కాదు, ప్రతి పెద్ద సినిమా విషయంలో కలెక్షన్స్ మాత్రమే ప్రామాణికం అవుతున్న వైనం తెలిసిందే. అలాగే నాని చేసిన “నేను లోకల్” అనేది కేవలం కమర్షియల్ కోణంలో తీసిందే గానీ, కధగా అందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు.
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…