
‘బిగ్ బాస్’ ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే ముందుగా గుర్తుకు వచ్చేవి ‘తొడకొట్టే సన్నివేశాలే.’ కానీ ‘బిగ్ బాస్’ తర్వాత తారక్ లోని హ్యూమర్ యాంగిల్ ప్రేక్షకులకు తెలిసివచ్చింది. సమయస్పూర్తిగా ‘బిగ్ బాస్’తో ప్రేక్షకులను అలరిస్తూ చేసిన జూనియర్ ఎన్టీఆర్ లెగసీని ప్రస్తుతం నాని అందిపుచ్చుకున్నాడు. ఆ స్థాయిలో కాకపోయినా కొంతవరకు నాని తన ప్రయత్నం తాను చేస్తున్నాడు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ను చూసిన కళ్ళకు నాని పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడన్నది వాస్తవం. దీనిపై ఎలిమినేట్ అయిన సంజన స్పందిస్తూ… ‘జూనియర్ ఎన్టీఆర్ ను ఐ ఫోన్ తో, నానిని నార్మల్ ఫోన్’తో పోల్చిన విషయం తెలిసిందే. ఇది కాస్త వైరల్ అయ్యి నాని దాకా చేరింది. దీంతో నాని ఎలా స్పందిస్తారో అనుకుంటే… ఒక్క ముక్కలో మొత్తం సీన్ ను కామెడీ చేసేసాడు.
‘నాక్కూడా ఐ ఫోన్ అంటేనే ఇష్టం’ అంటూ ఓ అభిమాని వేసిన ప్రశ్నకు నాని జవాబు చెప్పి, తనలోని చమత్కారాన్ని బయటపెట్టాడు. బహుశా ఈ సీజన్ ముగిసే సరికి సరికొత్త నాని కూడా ప్రేక్షకులకు పరిచయం అవుతాడేమో చూడాలి. ఇదంతా ‘బిగ్ బాస్’ మహిమో ఏమో గానీ, సిల్వర్ స్క్రీన్ పై చూస్తున్న నటులకు, స్మాల్ స్క్రీన్ పై అలరిస్తోన్న అదే నటులకు వ్యత్యాసం మాత్రం వరదలా ఉంది.
Sai Pallavi has made it clear that she wants a husband who can admit his…
Namit Malhotra’s ambitious Ramayana is one of the most anticipated Indian films, but a massive…