
Nani Stands Out in the Telugu Tier 2 Heroes Race
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్స్ కి టైర్స్ తో సంబంధం లేదు. వాళ్ళది సపరేట్ బేస్. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలని.. వాళ్లకి జనాల్లో ఉండే క్రేజ్ మరియు డే1 ఓపెనింగ్స్ ను సాధించుకునే స్థాయిని బట్టి టైర్ 1 హీరోలుగా పేర్కొనబడతారు. ఆ తర్వాత టైర్ 2 & 3 అంటూ చాలా డివిజన్లుగా హీరోలను విడదీయడం జరిగింది.
ముఖ్యంగా టైర్ 2 హీరోలుగా రామ్, నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండలు ఎప్పటికప్పుడు పోటీ పడుతూనే ఉన్నారు. వీళ్లలో నాని ఒక్కడే కాన్సిస్టెంట్ గా కంటెంట్ & కలెక్షన్స్ తో టైర్ 1లోకీ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మిగతా హీరోలందరూ సరైన సక్సెస్ సొంతం చేసుకోలేక, ప్రేక్షకుల్ని తమ కంటెంట్ తో ఎంగేజ్ చేయలేక తడబడుతూనే ఉన్నాడు.
స్కంద, డబుల్ ఇస్మార్ట్, ఆంధ్ర కింగ్ తాలుక సినిమాలతో రామ్ ఆల్రెడీ లాస్ట్ పొజిషన్ లో కూర్చుండిపోగా.. థ్యాంక్యూ, కస్టడీ, తండేల్ లాంటి సినిమాలతో నాగచైతన్య కూడా మెల్లగా వెనకబడుతూ వచ్చాడు. ఇక విజయ్ దేవరకొండ ఏమో ఏకంగా 8 వరుస ఫ్లాపులతో ఆ టైర్ 2 లిస్ట్ నుండి పక్కకి వచ్చేశాడు కూడా.
నాని తనకు టైర్స్ అంటే ఇష్టముండవని, తనని తాను ఎప్పుడూ ఒక డివిజన్ కి చెందిన హీరోగా చూసుకోనని పలుమార్లు పబ్లిక్ గా, స్టేజ్ మీద కూడా చెప్పినప్పటికీ.. నాని ఒక్కడే టైర్ 1 హీరోల తర్వాత కాస్త కన్సిస్టెంట్ గా హిట్స్ & ఓపెనింగ్స్ సాధిస్తూ టైర్ 2లో స్థిరంగా ఉండగలుగుతున్నాడు.
మధ్యలో ప్యారడైజ్ లాంటి సినిమాలతో టైర్ 1 ఎంట్రీ కోసం తాపత్రయపడినప్పటికీ.. ఆ సినిమా డిజాస్టర్ గా నిలవడం, ఓటీటీ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా మొత్తం సినిమాని దారుణంగా ట్రోల్ చేయడంతో నాని పొజిషన్ టైర్ 2లో స్థిరపడింది. అయితే.. ఇప్పుడు టైర్ 2లో ఉన్న ఏకైక హీరోగా కూడా నానిని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. మంచి ఓపెనింగ్స్ & బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ తో ఆ లిస్ట్ లో కనిపిస్తున్నది నాని ఒక్కడే.
మరి విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రామ్, నితిన్ వంటి హీరోలు ఇప్పటికైనా తమ స్ట్రాంగ్ బేస్ ఏంటి అనేది అర్థం చేసుకొని.. నానితో పాటుగా ఆ టైర్ 2 లిస్ట్ లో నిలుస్తారో లేక ఇలానే మాస్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయపడుతూ.. ఆడియన్స్ మైండ్ లో నుండి మెల్లగా సైడ్ అయిపోతారో చూడాలి.
The Congress seems to have made up its mind about the Khairatabad by-election. Chief Minister…
Generally, when a sequel to a successful franchise is announced, it naturally creates considerable excitement…