Telugu

ప్లాపులు వచ్చినా భారీగానే… నాని కోసం 50 కోట్లు

నాని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం లాంచైన ఈ సినిమా ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఆ సమయానికి నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా విడుదల అయిపోతుంది. ఇందులో నానికి జోడిగా ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. సహజంగా ఐదుగురు హీరోయిన్లు ఉండే సినిమాలు ఎవరో ఒకరిద్దరు పేరు ఎన్నిక కలిగిన హీరోయిన్లను పెట్టి మిగతా వారిని ఎవరో ఒకరిని పెట్టేసి లాగించేస్తారు.

అయితే ఈ సినిమాలో మాత్రం అందరూ బాగా గుర్తింపు ఉన్న వాళ్ళనే పెట్టుకోవాలని విక్రమ్ అనుకుంటున్నాడట. ఇప్పటికే ఐదుగురిలో కీర్తి సురేశ్, ప్రియా వారియర్, మేఘ అకాశ్ లను ఎంపిన చేశారు. ఒక తమిళ సినిమాలో కన్ను కొట్టి దేశం మొత్తాన్ని కట్టిపడేసిన ప్రియా వారియర్ కు ఇదే తొలి తెలుగు సినిమా అవుతుంది. త్వరలోనే మరో ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయనున్నారు. ఫిలింనగర్ లోని వందతుల ప్రకారం ది క్యూరియన్ కేస్ అఫ్ బెంజిమెన్ బటన్ అనే హాలీవుడ్ సినిమా స్పూర్తితో ఈ సినిమా స్క్రిప్టు రాసుకున్నాడు విక్రమ్.

ADVERTISEMENT

వచ్చే ఏడాది మొదట్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం 50 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు సమాచారం. ఇది నాని కేరీర్ లోని అతి పెద్ద బడ్జెట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా శాటిలైట్ .. డిజిటల్ .. హిందీ డబ్బింగ్ హక్కులను దృష్టిలో పెట్టుకుని, ఆ మొత్తం బడ్జెట్ కి మైత్రీ మూవీ మేకర్స్ వారు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలు కాకముందే సినిమాకు సంబందించిన ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. ఈ క్రేజ్ ను ముందే ఊహించి ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధం అయ్యారట.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hyderabad Prostitution Racket: Three Uzbek Women Detained

Hyderabad police have busted an alleged prostitution racket operating from a service apartment in Madhapur…

34 minutes ago

కూటమికి మిత్రధర్మం ‘లక్ష్మణ రేఖ’ కానుందా…?

స్థానిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించిన సీఎం బాబు కూటమి పార్టీ నేతల గెలుపు కోసం టీడీపీ…

39 minutes ago