Telugu

నానికి క్లాస్ పీకుతున్న ట్విట్టర్ జనాలు!

ఒక హీరోకు అభిమానులు ఎంత ముఖ్యమో… “నేనింతే” సినిమాలో సాయిరామ్ శంకర్ పాత్ర ద్వారా పూరీ జగన్నాధ్ చూపించారు. తమ హీరో ఎలాంటి సినిమా చేసినా భుజాన వేసుకుని నిస్వార్ధమైన పబ్లిసిటీ చేయగల స్వభావం ఒక్క అభిమానుల దగ్గర మాత్రమే దొరుకుతుంది. మరి అలాంటి అభిమానులను దూరం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటారా? ఖచ్చితంగా కాదు! కానీ ‘నాచురల్ స్టార్’ నాని మాత్రం ఇదే చేసారంటూ ట్విట్టర్ జనాలు ఓ చిన్న సైజ్ క్లాస్ పీకుతున్నారు.

“నిన్ను కోరి” ఆడియోకు సరైన పబ్లిసిటీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఓ నాని అభిమాని, ఆ సినిమా నిర్మాతలలో ఒకరైన కోన వెంకట్ కు సదరు విషయాలను చెప్దామని భావిస్తే, సదరు అభిమాని ట్విట్టర్ ఖాతాను కోన వెంకట్ బ్లాక్ చేయడంతో అసలు సమస్య తలెత్తింది. ఈ ట్వీట్ ను నానికి కూడా పంపడంతో చూసిన నాని, “నా ఫ్యాన్ అయినందుకు థాంక్స్, కానీ నీ ట్వీట్లు ఇతరులు చూస్తారని నీకు తెలుసా? నువ్వు వాడే భాష అయినా మార్చుకో లేక నీ ట్విట్టర్ హ్యాండ్లింగ్ అయిఆ సరిగ్గా చేయి” అంటూ సూచించాడు.

ADVERTISEMENT

ఇది గమనించిన నెటిజన్లు నానిని రౌండప్ చేసారు. “ట్విట్టర్ లో మీకు ఉన్న ఏకైక జెన్యూన్ అభిమాని అతను, ఏదైనా చెప్పాలనుకుంటే ఇలా బహిరంగ సందేశం బదులు, డైరెక్ట్ మెసేజ్ చేసి ఉండొచ్చు కదా” అని చాలా మంది సదరు అభిమానికి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నారు. ఒక సాధారణ అభిమాని భాష అలాగే ఉంటుంది, దానిని అర్ధం చేసుకోకపోతే ఎలా? ఒక నిజమైన అభిమానిని పోగొట్టుకుంటావా? నీ డై హార్డ్ ఫ్యాన్ మీద ఇలాంటి ప్రకటన చేస్తావా? ఫ్యాన్స్ ఏమోషన్స్ అలాగే ఉంటాయి, అవి అర్ధం చేసుకుంటేనే హీరో అవుతారు.

ఇలా ఒకటేమిటి వందల కొద్ది సందేశాలు సదరు అభిమానిని సమర్ధిస్తూ… నానిపై ట్విట్టర్ జనాలు మండిపడుతున్నారు. అభిమానుల విషయంలో హీరోలు ఎంతటి జాగ్రత్త వహించాలో ఈ ఉదంతం చెప్పకనే చెప్తోంది. అలాగే ఇంతకుముందు చాలా మంది హీరోల విషయంలో కూడా ఇది నిరూపణ అయ్యింది. తమ ట్వీట్లకు అస్సలు స్పందించకపోయినా, పెద్దగా బాధపడరు, ఫీల్ అవ్వరు గానీ, తమ నిస్వార్ధమైన అభిమానాన్నే కించపరిచే ప్రవర్తిస్తే మాత్రం… వారికి కూడా మనోభావాలు ఉంటాయని సదరు హీరోలకు గుర్తు చేయక మానరు. ప్రస్తుతం ట్విట్టర్ జనాలు నానికి అదే చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Irumudi Is A Miracle In Mythri’s Journey: Producers

The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…

46 minutes ago

సీఎం హోదాలోనే అసెంబ్లీ కి…

ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…

51 minutes ago