నాన్నకు ప్రేమతో “ఫస్ట్ డే” టార్గెట్!

‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానప్పటికీ, రిలీజ్ డేట్ ను జనవరి 13వ తేదీగా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో సంక్రాంతి పండగ పర్వదినాన ప్రేక్షకులను పలకరించబోతున్న తొలి సినిమాగా “నాన్నకు ప్రేమతో” సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఏకంగా జూనియర్ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున పబ్లిసిటీలో పాల్గొంటున్నారు. మరి ఇంతలా అంచనాలున్న ఈ సినిమా ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుందనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

రెండవ రోజు “డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా” చిత్రాలు, మూడవ రోజు “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రాల విడుదలలు ఉండడంతో, సినిమాకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా ఖచ్చితంగా ధియేటర్ల నుండి తీసేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో మొదటి రోజునే వీలైనంత ఎక్కువ రాబట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దానికి తగిన విధంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జూనియర్ నటించిన గత చిత్రాలు ఓపెనింగ్ డే నాడు దాదాపు 10 కోట్ల వరకు రాబట్టాయి. మరి ఈ సినిమాల కంటే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డ “నాన్నకు ప్రేమతో” ఫస్ట్ టార్గెట్ ఎంత అంటే… “శ్రీమంతుడు” సినిమాను దాటేటంత… అంటున్నాయి సినీ వర్గాలు.

“శ్రీమంతుడు” సినిమా ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో కలిపి దాదాపు 15 కోట్ల వరకు కొల్లగొట్టగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఖ్య మరో 10 కోట్లు ఉంటుంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏ రీతిలో ఉన్నా, ఏపీ, తెలంగాణాలలో మాత్రం ఎన్టీఆర్ టార్గెట్ అందుకోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో జూనియర్ కు పెద్దగా మార్కెట్ లేకపోయినప్పటికీ, సుకుమార్ సినిమాలకు మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ రకంగా “నాన్నకు ప్రేమతో” సినిమా ఓవర్సీస్ లో కూడా చెప్పుకోదగ్గ వసూలు రాబట్టవచ్చని అంచనా.

మొత్తమ్మీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్లు వరకు “నాన్నకు ప్రేమతో” సినిమా టార్గెట్ ఫిక్సయ్యింది. మరి ఈ సంఖ్యను ‘బుడ్డోడు’ అందుకుంటాడా? అభిమానులైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయండి… దుమ్ము దులుపుతాం అంటున్నారు. “నాన్నకు ప్రేమతో” సినిమాకున్న క్రేజ్, పండగ సెలవుల రీత్యా, ఎటువంటి ‘ట్విస్ట్’లు లేకుండానే జూనియర్ ఈ టార్గెట్ ను అందుకుంటారని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

Share
Published by

Recent Posts

చట్ట సభలు కాస్త వీధి పోరాటాలుగా మారుతున్నాయా.?

నానాటికి అసెంబ్లీ సమావేశాల అర్ధం మారుతూపోతుంది. ఒకప్పుడు ప్రజాసమస్యల పరిష్కారానికి అధికార - విపక్షాల మధ్య జరిగే చర్చలకు వేదికైన…

11 seconds ago

AK47: Dasara Release Plans Take an Interesting Turn

AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…

13 minutes ago