“డిక్టేటర్”కు దోహదం చేసిన “నాన్నకు ప్రేమతో”

తొలిరోజు అంతంత మాత్రపు ‘టాక్’నే సొంతం చేసుకున్న నందమూరి నటసింహం “డిక్టేటర్” అనూహ్యంగా పుంజుకుంటోంది. మాస్ ప్రియులను మాత్రమే ఆకట్టుకునే చిత్రంగా అందుకున్న టాక్ క్రమక్రమంగా ‘హిట్’ రేంజ్ కు చేరుకుంటోంది. తొలిరోజు ఏపీ, తెలంగాణాలలో కలిపి దాదాపు 6 కోట్ల వరకు కొల్లగొట్టిన “డిక్టేటర్” రెండవ రోజు “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా దెబ్బకు కాస్త తగ్గినప్పటికీ, మూడవ రోజు మళ్ళీ పుంజుకుని బాక్సాఫీస్ బరిలో నిలిచినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

“డిక్టేటర్” పుంజుకోవడానికి దోహదం చేసిన అంశాలలో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమా ఉందని తెలుస్తోంది. సుకుమార్ అందించిన మైండ్ గేమ్ మ్యాజిక్ ఏపీ, తెలంగాణాలలో ఒక వర్గం ప్రజలకే పరిమితం కావడంతో, ప్రేక్షకులకు “డిక్టేటర్” మరో ఛాయిస్ గా మారిందని టాక్. దీనికి తోడు సినిమా కూడా బాగుందనే టాక్ క్రమంగా పెరగడంతో నందమూరి అభిమానులకు నిజమైన పండగను తీసుకువచ్చింది.

ADVERTISEMENT

“నాన్నకు ప్రేమతో” సినిమాపై ఉన్న అంచనాల రీత్యా తొలి రోజు భారీ వసూళ్ళు సాధించడంతో… కలెక్షన్స్ రీత్యా ఒక మెట్టు పైన ఉన్న జూనియర్, పబ్లిక్ టాక్ లో మాత్రం క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నారు. అయితే ఓవర్సీస్ లో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది. అక్కడ ‘నాన్నకు ప్రేమతో’ విజయవంతమవ్వగా, ‘డిక్టేటర్’ ఆశించిన స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది.

Share
Published by

Recent Posts

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

9 minutes ago

Vijay’s Assembly Statement: A Timeline With Political Fire

Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…

21 minutes ago