Telugu

ఇదేం ప్రభుత్వం? అసలు ఉందా లేదా?చంద్రబాబు ఆగ్రహం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం చెలరేగింది. దేశంలో చాలా చోట్ల ఇటువంటి హేయమైన నేరాలు జరుగుతుంటాయి. వెంటనే పోలీసులు స్పందించి నేరస్తులను అరెస్ట్ చేస్తారు. కానీ విజయవాడలో బాధిత కుటుంబం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇదే ప్రశ్నించారు.

ఈరోజు మధ్యాహ్నం బాధితురాలిని, కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆయన పార్టీ నేతలతో కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకొన్నప్పుడు అదే సమయంలో రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ కూడా తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఇద్దరూ ముఖాముఖి ఎదురుపడ్డారు.

ADVERTISEMENT

దాంతో చంద్రబాబునాయుడు ఆమెనే ఈ ఘటనపై వివరణ అడిగే ప్రయత్నం చేయగా, “ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది…ఇక్కడ రాజకీయాలు చేయడానికి అందరినీ వెంటబెట్టుకొని వచ్చారా?” అంటూ ఆమె కాస్త దురుసుగా జవాబివ్వడంతో ఆ మాటలు విని చంద్రబాబునాయుడు షాక్ అయ్యారు.

వెంటనే తేరుకొని “ఓ ప్రతిపక్ష నేతతో ఇలాగేనా మాట్లాడేది?జరిగిన దానికి ఏమాత్రం సిగ్గుపడకపోగా, బాధితురాలిని పరామర్శించడానికి వచ్చిన మాపైనే ఎదురుదాడి చేస్తారా?రాజధాని పరిధిలోనే ఇంత ఘోరమైన నేరం జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? అసలు ప్రభుత్వం ఉందా లేదా?ఉంటే క్రూర మృగాల్లా ప్రవర్తించినవారిని వెంటనే ఎందుకు అరెస్ట్ చేయించలేదు?దీనికి బాధ్యులైన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? బాధితురాలికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను. క్రూర మృగాల్లా ప్రవర్తించిన నిందితులను తక్షణం అరెస్ట్ చేసి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాను,” అని అన్నారు. ఆ తరువాత బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పి ఆమెకు న్యాయం జరిగేవరకు టిడిపి పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

వాసిరెడ్డి పద్మ ఒక మహిళ అయ్యుండి, మహిళా కమీషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ తమ అధినేత చంద్రబాబునాయుడుతో ఈవిదంగా అనుచితంగా ప్రవర్తించడంపై టిడిపి సీనియర్ నేతలు బోండా ఉమ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి కార్యకర్తలు ఆమెను అడ్డుకొన్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితులు అదుపు చేశారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kolkata Durga Puja Stampede Kills 19

A stampede at a Durga Puja Pandal in Kolkata has claimed 19 lives and left…

21 minutes ago

The Paradise to Ranabaali: Mixed Talk, Strong Regional Support

Regional pride seems to be playing a role in how Telugu audiences are receiving films,…

51 minutes ago