
మంత్రి బొత్స సత్యనారాయణని ఉద్దేశ్యించి, “ఆయనకు సారా వ్యాపారాల గురించి తప్ప చదువుల గురించి ఏమి తెలుసు?అందుకే ఈ ఏడాది పదో తరగతి ఫలితాలు అంత దారుణంగా వచ్చాయి. అయినా నాడు-నేడు పేరుతో స్కూళ్ళకు రంగులు వేయించేస్తే పిల్లలకు చదువులు వచ్చేస్తాయా?ముఖ్యమంత్రి,ఈ మంత్రి ఇద్దరూ కలిసి రాష్ట్రంలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు. విద్యావ్యవస్థ పట్ల ఇద్దరికీ అవగాహన లేకపోవడం వలననే ఇలా చేస్తున్నారు. విజయనగరంలో నా సభకు అనుమతివకుండా అడ్డుకోవాలని మంత్రి బొత్స ప్రయత్నించారు. కానీ ఏమైంది…మీరు వద్దనుకొన్నా వేలాదిమంది తరలివచ్చారు. ఇప్పుడు అడ్డుకోగలరా?,” అని సవాల్ విసిరారు.
బడుగు బలహీనవర్గాలంటే సిఎం జగన్మోహన్ రెడ్డికి చాలా గౌరవం, అభిమానమని వైసీపీ ప్రభుత్వం వచ్చాకనే సామాజిక న్యాయం జరిగిందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడంపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “ఓ పక్క విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెంచేసి ప్రజలను పీడిస్తూ, సామాజిక న్యాయం చేస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. ఎవరు సామాజిక న్యాయం చేశారో… సంక్షేమ పధకాలకు ఎవరెంత ఖర్చు చేశారో బహిరంగ చర్చకు రాగలవా జగన్ రెడ్డీ?”అంటూ చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు.
“పంట భీమా పధకం కింద ఎంతమంది రైతులకు ప్రభుత్వం చెల్లించిందో ఆన్లైన్లో జాబితా పెట్టగలవా జగన్ రెడ్డీ?” అంటూ మరో సవాల్ విసిరారు.
రాష్ట్రంలో రాక్షస పాలన, అరాచక పాలన సాగుతోందని దీనిని చూసి ఎవరూ భయపడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే దీనిని అంతమొందించి ప్రజల కష్టాలను తీరుస్తానని అందుకోసం ఎంత కష్టమైన భరించేందుకు సిద్దంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు అన్నారు.
జగన్ ప్రభుత్వం పట్ల ఇప్పటికే ప్రజలలో తిరుగుబాటు మొదలైందని కనుక వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటుకి రూ.10,000 చొప్పున పంచినా ఓటమి ఖాయం అని అన్నారు.
కేవలం మూడేళ్ళలోనే జగన్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసిందని, అయినా ఒక్క పని కూడా పూర్తిచేయలేకపోయిందని చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం నిలువునా అప్పుల్లో ముంచేసిందని అన్నారు. కానీ ఈ తప్పులన్నీ సరిద్దిద్దే శక్తి తనకు ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి కేవలం మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేశారని, మున్ముందు ఇంకేమీ చేస్తారో అని ప్రజలు సైతం భయపడుతున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…