
ఈసారి పదో తరగతిలో సత్ఫలితాలు సాధించలేకపోవడానికి కారణం కరోనా మహమ్మారి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమర్ధించుకొన్నారు. కరోనా కారణంగా 8,9 పరీక్షలు వ్రాయకుండానే పదో తరగతికి ప్రమోట్ అయిన విద్యార్దులపై దృష్టి పెట్టవలసిన విద్యాశాఖ ‘నాడు నేడు’పై ఎక్కువ దృష్టి పెట్టడం, ఆ ప్రయత్నంలో ఉపాధ్యాయులను ఇతర కార్యక్రమాలకు, సేవలకు పురమాయిస్తుండటం వలన విద్యార్దులకు అన్యాయం జరిగిందని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు, ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
పదో తరగతి ఫలితాలపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ, “టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు… ఇది జగన్ సర్కార్ ఫెయిల్యూర్. అమ్మ ఒడి, సంక్షేమ పధకాలకి విద్యార్దులని తగ్గించే కుట్ర జరిగింది. తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షలలో పేపర్ లీక్, మంత్రివర్గ సమావేశం కాపీయింగ్, షాపింగ్ మాల్ ప్రాక్టీసులతో ప్రభుత్వం అభాసుపాలైంది,” అని ట్వీట్ చేశారు.
మరో ట్విట్లో, “ టెన్త్ రిసల్ట్స్ వాయిదా…దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమే. నాడు నేడు పేరుతో 3500 కోట్లు మింగేసి విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసారు,” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరో ట్విట్లో, “టీచర్లకు వైన్షాపుల వద్ద డ్యూటీ వేసే శ్రద్ద విద్యపై పెట్టలేదు. ఒక్క డిఎస్సీ తీయకపోవడంతో హైస్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. 71 స్కూళ్ళలో జీరో ప్రతిష్టాత్మకంగా… 20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు అవడం వైసీపీ ప్రభుత్వం పాపమే,” అని నారా లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…